Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. రాజకీయ వైషమ్యాలు,విబేధాలు మరిచి మరీ మోడీ,అమిత్ షా ద్వయం రాంనాథ్ కోవిద్ అభ్యర్థిత్వం మీద భిన్నాభిప్రాయాలు రాకుండా చూస్తున్నారు.మోడీ స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కూడా ఆయన ఫోన్ చేసి కోవిద్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా కోవిద్ కి మద్దతు ఇస్తామని చెప్పారట.ఇక ఏపీ సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసిన మోడీ ఆయన మద్దతుతో పాటు ఓ పని కూడా అడిగారు.రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీని కోవిద్ అభ్యర్థిత్వానికి ఒప్పించాలని బాబుని మోడీ కోరారు. అందుకు సరే అన్న బాబు మమత విదేశీ పర్యటన ముగించుకురాగానే ఆ ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో చూపించిన చతురతనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా చూపింది బీజేపీ.సీఎం కి పీఎం ఫోన్ చేస్తే,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జగన్ కి ఫోన్ చేశారు.కోవిద్ కి మద్దతు ఇవ్వాలని కోరారు.అందుకోసమే ఎదురు చూస్తున్న జగన్ వెంటనే మా మద్దతు మీకే అని తేల్చేశారు.రాష్ట్రపతి ఎన్నికల టైం లో బీజేపీ ఏపీ లో అధికార,ప్రతిపక్షాలు రెంటినీ దువ్వింది.ఈ చర్య ద్వారా ప్రస్తుతం పని జరుపుకోవడమే కాక భవిష్యత్ లో రెండు పార్టీలతో సంబంధాలకు డోర్లు బార్లా తెరుచుకునేలా ప్లాన్ చేసింది.ఎంతైనా మోడీ,అమిత్ షా ద్వయం ఇక్కడ కూడా భలే రాజకీయ చతురత చూపారు.ఎంతో సీనియర్ అనుకునే బాబుని,ఎవరికీ లొంగని మొండిఘటం అనుకునే జగన్ ని భలే బుట్టలో వేశారు.కాదంటారా?