తమిళనాడులో ఓ యువకుడు ఘోరానికి దిగజారాడు. ఓ యువతిని పోటోలు తీసిన యువకుడు నమ్మించి మోసం చేశాడు. ప్రేమ, పెళ్లి ముసుగులో మాయమాటలు చెప్పిన యువకుడు అన్ని రకాలుగా ఆ యువతిని ఉపయోగించుకొని మోసం చేశాడు. అయితే ఆ ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన సమయంలో ప్రియుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసేశాడు.
అయితే లాక్ డౌన్ సందర్బంగా వ్యాపారం మూతపడటం, ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జల్సాల కోసం యువతిని డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఏకాంతంగా తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు ప్రియురాలు నిరాకరించడంతో ఆమె పర్సనల్ వీడియోలు, ఫోటోలను ప్రియుడు సోషల్ మీడియాలో పోస్టు చేసేశాడు. దీంతో ఆమెలో ఆందోళన మొదలైంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే… తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అళగియా పాండిపురానికి చెందిన మార్ఫిన్ గణేష్ అనే యువకుడు ఓ సీడీ షాపును నడుపుకుంటున్నాడు. అయితే సీడీ షాపుకు వచ్చివెళ్లే వారితో మార్ఫిన్ గణేష్ పరిచయాలు విపరీతంగా పెంచుకునేవాడు. దీంతో మంజుల అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడి అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా రూపాంతరం చెందింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అలా గణేష్ ఎన్నో సార్లు తన కోరికలను తీర్చుకున్నాడు. దీంతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసేవాడు. ఇక లాక్డౌన్ రావడంతో గణేష్ సీడీల షాపు మూతపడింది. ఆదాయం లేదు. ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. దీంతో అతడి అసలు రంగు బయట పడింది. మంజులతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలు బయటకు తీశాడు. వాటిని ప్రియురాలికి చూపించి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అందరికీ చూపిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో భయపడిన ఆమె అనేకసార్లు అతడికి డబ్బులు ఇచ్చింది. ఈ మధ్య మళ్లీ డబ్బుల కావాలని అతడు వేధింపులకు దిగాడు. ఈ సారి ఇక కుదరదని.. మంజుల తెగేసి చెప్పింది. అలాగే.. తన కూతురి జోలికి రావద్దని కూడా మంజుల తల్లి గణేష్ కు వార్నింగ్ ఇచ్చింది. దీంతో కక్ష పెంచుకున్న గణేష్.. ప్రియురాలి న్యూడ్ వీడియోలు, ఫోటోలు సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మంజుల తల్లి అంజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గణేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ పోస్ట్ లను పోలీసులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.