Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రబాబు దళిత ద్రోహి ఎన్టీఅర్ నుండి పార్టీ లాక్కున్నాడు అంటూ నిన్న మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా మోత్కుపల్లిని తెలుగుదేశం నుండి బహిస్కరిస్తున్నం అని ఆ రాష్ట్ర అధ్యక్ష్యుడు కూడా ప్రకటించారు. అయితే దానికి కౌంటర్ గా ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌కు భక్తుడిగా ఆయన పెట్టిన జెండా కోసం పరితపించానే తప్ప ఏనాడూ పదవులు ఆశించలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. పదవులు ఇవ్వనందుకే విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబు చేయిస్తోన్న ప్రచారంలో నిజంలేదని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌కు చంపేసి, జెండాను దొంగతం చేసిన ద్రోహి చంద్రబాబు. అలాంటి నిన్ను నేను పదవులు అడిగిన మాట నిజమే అయితే… నీ కొడుకు లోకేశ్ మీద ప్రమాణం చేస్తావా?’’ అని సవాలు విసిరారు.
‘ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి నేను టీడీపీలోనే ఉన్నా. 1983లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయి.. తెలుగుదేశంలోకి బాబు వచ్చారు. అప్పటి నుంచి కుట్రలు చేసి ఎన్నెన్నో పైరవీలు చేశారు. ఆయన పెట్టిన మానసిక వేదనతోనే దాదాపు 20మంది టీడీపీ సీనియర్ నేతలు చనిపోయారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కూడా అలాగే ప్రాణాలు విడిచారు. చివరికి అలా మరణించిన వారి ఆత్మను కూడా అమ్ముకునే నీచమైన వ్యక్తి చంద్రబాబు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయినా నేను అండగా ఉన్నా పదేళ్లు అధికారం లేకపోయినా వెంట ఉన్నా.. ఇప్పుడు ఎందుకు ఉన్నానా అని బాధపడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.