Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
MP Kesineni Nani Got Political Excellency Award
టీడీపీలో కొనసాగుతున్న రెబల్ ఎంపీగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నానికి అరుదైన గౌరవం దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల నేతల సమక్షంలో ఆయనకు పొలిటికల్ ఎక్సెలెన్సీ అవార్డు ఇచ్చారు. నాని కృషి ఫలితంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని 264 గ్రామాలను టాటా గ్రూప్ దత్తత తీసుకోవడంతో నానికి క్రేజ్ పెరిగింది. ఓ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థ నానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ చేతుల మీదుగా సన్మానం చేయించింది.
గ్రామాల దత్తత కాన్సెప్టుకు టాటా ట్రస్ట్ అనుకూలం. అయితే ట్రస్ట్ విడుదల చేసిన నిధులు దుర్వినియోగం జరగకుండా పని చేసి చూపించే నేత కావాలి. నానిని పూర్తిగా నమ్మిన టాటా ట్రస్ట్ ఈ బృహత్తర బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. కానీ నానికి పొలిటికల్ ఎక్సెలెన్సీ అవార్డుపై ఆయన ప్రత్యర్థులు జోకులేసుకుంటున్నారు. నానికి ఆ అర్హత ఉందా.. అని ప్రశ్నిస్తున్నారు.
విజయవాడకు ఎన్నో చేస్తానని చెప్పి.. ఏమీ చేయని నాని ట్రావెల్స్ వ్యాపారం వదిలేసుకుని పబ్లిసిటీ స్టంట్ చేశారని చెబుతున్నారు. ఆ పబ్లిసిటీ స్టంట్ కు టాటా లాంటి మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థ పడిపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాని బిజినెస్ బ్రెయిన్ అని, తనకు లాభం లేకుండా ఏ పనీ చేయరని, ఆయన్ను ఓ కంట కనిపెట్టాలని టాటా ట్రస్ట్ ను కోరుతున్నారు.
మరిన్ని వార్తలు
ఒంటరి స్త్రీ కి హైదరాబాద్ హోటల్ లో అవమానం… NRI స్పెషల్
సంపాదించడమే కాదు ఇవ్వడమూ తెలిసిన చౌదరి గారు.