ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

కాంగ్రెస్ నేతలు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్ని సందర్శించేందుకు పలువురుకాంగ్రెస్ నేతలు బయల్దేరి వెళ్లారు. ఎల్లూరు వద్ద నీట మునిగిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పంప్ హౌజ్ పరిశీలను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి బయల్దేరారు. అయితే మార్గంమధ్యలోనే తెక్కపల్లి వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఆ సమయంలో వాహనాలు దిగడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు.

దీంతో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనితో ఎంపీ రేవంత్ రెడ్డి సహా… ఇతర కాంగ్రెస్ నేతలు సంపత్, మల్లు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులతో తెలకపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశత్వం నడుస్తోందని విమర్శించారు. ప్రమాదం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే.. మమ్మల్ని అనుమతించడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు.