Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంటు ఎగువ సభ రాజ్యసభలో వైసీపీకి ఒక్కరే ఎంపీ ఉన్నారు. ఆయనే విజయసాయిరెడ్డి. ఏనాడూ ప్రజాసమస్యలపై నోరెత్తని విజయసాయి రెడ్డి.. ఇప్పుడు డ్రగ్స్ గురించి మాత్రం తెగ మాట్లాడేశారు. ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసు గురించి.. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటన్నది చాలా పార్టీలకు అర్థం కాలేదు. కానీ ఇది పబ్లిసిటీ స్టంట్ అని ప్రత్యర్థులు తేల్చేస్తున్నారు.
డ్రగ్స్ కేసు గురించి లేవెనత్తడం ద్వారా తాము అప్ డేట్ పాలిటిక్స్ చేస్తున్నామని చెప్పుకోవడానికే వైసీపీ ఎంపీ ఛాన్స్ తీసుకున్నారని జాతీయ పార్టీలు కూడా ఫిక్సైపోయాయి. పైగా హైదరాబాద్ లో డ్రగ్స్ గురించి తమను నిలదీయడమేంటని కేంద్రం కూడా సీరియస్ గా ఉందట. మరి విజయసాయి తీసుకున్న ఛాన్స్ రివర్స్ అవుతుందా.. కాదా చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇప్పటికే కేసీఆర్ ఛాన్స్ దొరికితే పక్క రాష్ట్రం గురించి మీకెందుకని ఏపీ నేతలపై ఫైరౌతున్నారు. ఇప్పుడు జగన్ అనవసరంగా డ్రగ్స్ కేసులో వేలుపెట్టారని, కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటే నిందితులంతా ఏపీ వారేనని దుమ్మెత్తిపోస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ రాజకీయ అపరిపక్వత మరోసారి తేటతెల్లమైందంటున్నారు సీనియర్లు.
మరిన్ని వార్తలు