Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నరేంద్ర మోడీ కి సొంత పార్టీ ఎంపీనే షాక్ ఇచ్చాడు, ఓపక్క విపక్షాల విమర్శలు, నిన్నటి వరకు కావాలనే సభని వాయిదా వేయిస్తూ వచ్చారనే ఆరోపణలతో ఊపిరి సలపలేని విధంగా ఉన్న మోడీ ప్రభుత్వం మీద సొంత పార్టీకి చెందిన దళిత ఎంపీ ఒకరు లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని నగీనా స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న బీజేపీ ఎంపీ యశ్వంత్ సింగ్ శనివారం మోదీకి రాసిన లేఖలో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. మోడీకి రాసిన ఆ లేఖలో నాలుగేళ్ల మోడీ పాలనను సింఫుల్ గా తేల్చేశారు. గడిచిన నాలుగేళ్లలో మన(బీజేపీ) ప్రభుత్వం దేశంలోని 30 కోట్ల మంది దళితులకు చేసింది ఏమీలేదు. రిజర్వేషన్ వల్ల నేను ఎంపీగా గెలవడం తప్ప ప్రత్యేకంగా సాధించింది ఏమీలేదు. కేవలం దళితుడిని కావడంవల్లే నా సామర్థ్యాన్ని పార్టీ వినియోగించుకోవడంలేదని యశ్వంత్ సింగ్ పేర్కొన్నారు.
ఇదే లేఖలో.. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ సుప్రీంకోర్టుకు ఓ సూచన చేశారు. మొన్నటికి మొన్న బహ్రెయిచ్ ఎంపీ సావిత్రి బాయి మొన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ… ‘దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం ఒత్తిడి తెస్తున్నా బీజేపీ మౌనంగా ఉండటంలో అర్థమేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాబర్ట్‌గంజ్ బీజేపీ ఎంపీ చోటేలాల్.. మోదీకి రాసిన లేఖలో యూపీ సీఎం యోగి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన జిల్లాలో అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఎం సిబ్బంది తనను గల్లాపట్టి నెట్టేశారని ఆరోపించిన చోటేలాల్ పార్టీలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్ని ప్రశ్నిస్తూ మోడీకే లేఖ వ్రాశారు.
ఆ మరుసటి రోజే ఇటావా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గిరిజన బీజేపీ ఎంపీ అశోక్ దోహ్రీ యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, భారత్ బంద్‌లో పాల్గొన్న దళితులపై యోగి సర్కార్ తప్పుడుకేసులు బనాయిస్తున్నదంటూ ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇప్పుడు నగీనా ఎంపీ యశ్వంత్ బీజేపీ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని బాంబు పేల్చారు. ఇప్పటికే వరుసగా దళిత ఎంపీలు పార్టీ దళితులకి ఏమీ చేయలేదనే వ్యాఖ్యలు చేస్తుంటే ఇప్పుడు యశ్వంత్ వ్రాసిన లేఖ పార్టీకి డ్యామేజింగ్ గా మారటమే కాదు విపక్షాల విమర్శలకు బలోపేతం చేసేలా ఉండటంతో ఇప్పటికే పలు తలనొప్పులతో ఉన్న మోడీకి కొత్త తలనొప్పి మొదలయ్యింది. తాజా ఆరోపణలపై బీజేపీ అధిష్టానం స్పందించాల్సిఉంది.