అఖిల్‌కి ఇప్పుడు హిట్ అవసరం మాత్రమే కాదు అత్యవసరం. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు బోల్తా కొట్టడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అఖిల్. ఒకవైపు మెగా వారసులు, నందమూరి వారసులు తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇండస్ట్రీలో సత్తా చాటుతుంటే అక్కినేని వారసులు మాత్రం ఒక అడుగు వెనకే ఉన్నారు. అందులోనూ నాగ చైతన్య ఈ మధ్య పర్వాలేదనిపిస్తున్నా అఖిల్ మాత్రం ఇప్పటికీ హిట్ బోణీ కొట్టనేలేదు. మొదటి రెండు సినిమాల్లో లాగా భారీ హంగామాలని పక్కన పెట్టి Mr మజ్ను చిత్రాన్ని తెరకెక్కించారు. అనుభవం ఉన్న నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో కంప్లీట్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 23 కోట్లకు పైగా అమ్మారు. శాటిలైట్స్ రైట్స్ కూడా మంచి రేటు లభించింది. Mr మజ్నుకి ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి లాంటి సెన్సిబుల్ డైరెక్టర్ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పాడింది. దీనికి తోడు టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్ర విజయం ధీమా వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. పైగా జనవరి 25న సింగిల్‌గా థియేటర్స్ వస్తున్న Mr మజ్ను ఏమి చేస్తుందో మరి.