Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పటిలాగానే ముద్రగడ పద్మనాభం పాదయాత్ర కి ఆదిలోనే బ్రేక్ పడింది. కిర్లంపూడితో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్ని దిగ్బంధనం చేసిన పోలీసులు ముద్రగడ ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. అయినా అనుమతి లేని పాదయాత్ర కి అంగీకరించబోమని పోలీసులు ఆయనకి తేల్చి చెప్పారు. నిన్న హోమ్ మంత్రి చినరాజప్ప సైతం అనుమతి అడిగితే ఇస్తాం కానీ అదేమీ లేకుండా ముందుకు వెళతామంటే , శాంతిభద్రతల సమస్య సృష్టిస్తానంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ఎన్నిసార్లు పోలీసులు అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటున్నప్పటికీ ముద్రగడ వైఖరి మారడం లేదు. ఆయన అనుమతి తీసుకోవడం లేదు. ఒక్కసారి అనుమతి తీసుకుంటే పాదయాత్ర చేసేయొచ్చు కదా అని కాపు సోదరులు కూడా చర్చించుకుంటున్నారు. అయినా ఆ ఒక్కటి తప్ప అని ముద్రగడ భీష్మించుకు కూర్చుంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారా అని ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయి. ఒక్కసారి పోలీస్ అనుమతి తీసుకుని పాదయాత్ర మొదలెడితే ఆ తరువాత పరిణామాలకు, ఏదైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వాటికి కూడా బాధ్యత వహించాల్సి వుంటుందట. ముద్రగడ వెనుక ఉన్న వైసీపీ వ్యూహకర్తలకి కావాల్సింది ఈ పాదయాత్ర ద్వారా ఇంకొన్ని సమస్యలు ఏర్పడడం తప్ప పరిష్కారం కావడం కాదు. తుని ఘటన లాగే ఇంకోసారి చిచ్చు రగలాలని స్పాన్సర్స్ చెబుతుంటే ముద్రగడ మాత్రం పర్మిషన్ ఎలా కోరుకుంటారు ?. అంతా లోటస్ పాండ్ మాయ.
మరిన్ని వార్తలు