Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడేకొద్దీ రాష్ట్రంలో రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది. పార్టీలకి, వాటి నాయకులకి కులాల మీద ప్రేమ ఉండదు వాటి వల్ల వచ్చే ఓట్ల మీదే అని తెలియజెప్పే ఉదాహరణ ఇది. కాపు రిజర్వేషన్ కోసం ముద్రగడ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం వెనుక వైసీపీ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పోరాట ఫలితమో, ఇంకో కారణమో గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా వుంది. త్వరలో మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వబోనుంది. ఆ నివేదికని అసెంబ్లీ లో ప్రవేశపెట్టి కాపు రిజర్వేషన్ కి సంబంధించి ఓ తీర్మానాన్ని ఆమోదించి, నివేదికతో పాటు ఆ తీర్మాన ప్రతిని సైతం కేంద్రానికి పంపాలని బాబు భావిస్తున్నారు. ఇదే జరిగితే కాపు రిజర్వేషన్ అంశంలో టీడీపీ తో పాటు వైసీపీ కూడా అసెంబ్లీ వేదికగా తన అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది.
అందుకే అదను చూసి మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ రాకముందే ఈ నెల 16 న వైసీపీ బీసీ సెల్ మీటింగ్ విజయవాడలో పెడుతున్నారు. ఆ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అప్పుడే చంద్రబాబు బీసీ వ్యతిరేకి అన్న ప్రచారం మొదలెట్టాడు. ఆ రోజు బీసీ సెల్ సమావేశంలో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె ఉద్దేశం ఉన్నట్టు అర్ధం అవుతోంది. దీంతో అసెంబ్లీ లో కాపు రిజర్వేషన్ మీద తీర్మానం చేయకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం వైసీపీ ప్లాన్. ఇటు ముద్రగడ అటు జంగా ని రెచ్చగొడుతున్న జగన్ కత్తికి రెండు వైపులా పదును వున్నట్టే కదా.