ముద్రగడ కి జగన్ తత్వం బోధపడిందా?

Mudragada Understand Jagan Use And Through Behaviour.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అవసరం ఉన్నంత సేపు ఓడ మల్లన్న, అవసరం తీరాక బోడి మల్లన్న అన్న రీతి సాక్షాత్తు స్వానుభవంలోకి వచ్చిందట కాపు ఉద్యమ నేత ముద్రగడకి. ఏపీ సర్కార్, ఖాకీలు ఎంత కఠినంగా వ్యవహరించినా అర్ధం కాని వ్యవహారం ఒక్క దెబ్బతో ముద్రగడకి బోధపడేలా చేసిన ఘనత మాత్రం వైసీపీ అధినేత జగన్ కి దక్కుతుందట. నంద్యాల ఎన్నికల ఫలితం ఎలా వున్నా, కాకినాడ ఫలితం చూసాక ముద్రగడ దిమ్మ తిరిగిపోయిందట. తాను ఎన్ని పిలుపులు ఇచ్చినా కాపులు పట్టించుకోలేదన్న బాధ తొలుస్తుంటే దాన్ని షేర్ చేసుకుందామని తనతో ఆది నుంచి టచ్ లో వున్న ఓ వైసీపీ నాయకుడికి ఫోన్ చేశారట. అయితే రింగ్ అవుతున్నా ఎంతకీ ఆ నాయకుడు ఫోన్ తీయడం లేదట. అలా చేస్తూ పోయాక ఫోన్ తీసి ఇకపై నీతో టచ్ లో ఉండొద్దని బాస్ చెప్పాడని ఒకే మాట చెప్పి ఫోన్ పెట్టేసాడట. అటు వైసీపీ ని నమ్ముకుని ఇంత దూరం ప్రయాణించిన ముద్రగడకి ఇదంతా కాకినాడ ఎఫెక్ట్ అని అర్ధం అయ్యిందట. తాను పనికిరానని తెలిసిన వెంటనే పక్కనబెట్టిన జగన్ గురించి ఆలోచించి ముద్రగడ తీవ్ర ఆవేదనకు లోను అయ్యారట.

ఈ ఫోన్ ఎపిసోడ్ అయ్యాకే ముద్రగడ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే అక్కడా ముద్రగడ వైఖరి పట్ల పెద్ద సానుకూలత కనిపించలేదని తెలుస్తోంది. పైకి ఇది వ్యక్తిగత సమావేశం అని చెబుతున్నప్పటికీ ముద్రగడ తరపున ఓ రాజకీయ ప్రతిపాదన వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ ప్రతిపాదన కూడా కాపు రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉందట. అసలే ముద్రగడ అంటే మండిపడుతున్న సీఎం చంద్రబాబు ఈ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారు అన్నది కీలకం కానుంది. ఆయన పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తే ఇక కాపు ఓట్లలో చీలికతో కోస్తాలో పాగా వేయాలి అనుకున్న జగన్ ఆలోచనకు సైతం బ్రేక్ పడ్డట్టే. పైగా ముద్రగడ నిజంగా రివర్స్ అయితే ఆయన ఏ స్థాయిలో రచ్చ చేస్తాడో ఇప్పటికే అర్ధం అయ్యింది. ఆ అస్త్రం కూడా జగన్ మీదకే వదిలే పరిస్థితి వస్తే 2019 ఎన్నికల మీద కూడా జగన్ ఆశలు వదులుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు:

ఆమె గురించి స‌రిగ్గా తెలియ‌నే తెలియ‌దు

40 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే రిటైర్మెంట్