Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మీద కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కి హఠాత్తుగా జాలి, దయ పుట్టుకొచ్చాయి. కాపు రిజర్వేషన్ డిమాండ్ అమలుకు డిసెంబర్ 6 దాకా గడువు ఇచ్చిన ముద్రగడ పద్మనాభం ఎవరూ అడక్కుండానే ఆ డెడ్ లైన్ మరో నెలలు పెంచడానికి రెడీ అంటున్నారు. అబ్బో బాబు గారి మీద ముద్రగడకు జాలి, దయ కలిగింది అనుకునేలోపు అయితే ఒక్క షరతు అని ఆయన గారు మనసులో మాట బయటపెట్టారు. ఇన్నాళ్లు కాపులను బీసీల్లో చేరిస్తే చాలు అని చెప్పిన ముద్రగడ ఇప్పుడు మరో డిమాండ్ ముందుకు తెస్తున్నారు. బీసీల్లో చేర్చాక కూడా కాపులకు ఇచ్చే రిజర్వేషన్ లను ప్రత్యేక కేటగిరి కింద చేర్చి దానికి కూడా రక్షణ కల్పించాలట. ఇప్పటికే దాదాపు ఇదే రకమైన డిమాండ్ తో mrps ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ ఎప్పటినుంచో పోరాడుతున్నారు. అన్ని పార్టీలు ఓకే అన్నపాటికీ ఇప్పటికీ ఆ సమస్య ఓ కొలిక్కి రాలేదు. కాపులను చేరుస్తామంటేనే బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అయినప్పటికీ ఇచ్చిన హామీ నెరవేర్చడానికి బాబు ట్రై చేస్తుంటే ముద్రగడ కొత్త ఫిట్టింగ్ తో ముందుకు వచ్చారు.
ముద్రగడ తాజా డిమాండ్ చూసాక కాపుల్లో కూడా ఆయన మీద అనుమానాలు బలపడుతున్నాయి. ఈయన నిజంగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడా లేక వాటిని అడ్డుకోవడం ద్వారా ఎవరికో మేలు చేసే ప్రయత్నం చేస్తున్నాడా అని. అసలే క్లిష్టమైన సమస్య పరిష్కార దశలో ఉంటే దాన్ని ఇంకాస్త సంక్లిష్టం చేసేందుకు ముద్రగడ పావులు కదుపుతున్నాడు అనిపిస్తోంది. ముద్రగడ తాజా వ్యాఖ్యల మీద ఘాటుగా స్పందించడానికి కొందరు కాపు నేతలే సిద్ధం అవుతున్నారట. కాపు ఉద్యమాన్ని ఎవరి రాజకీయ ప్రయోజనాలకో ముడిపెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించబోతున్నారట. ఇప్పటికే నేను ఒంటరిని అని వాపోయిన ముద్రగడ కాపుల నుంచే ఆ రకమైన స్పందన వస్తే ఎలా రియాక్ట్ అవుతారో ?