Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ నెల 26నుంచి కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపడుతున్నారు. అయితే పాదయాత్రకు అనుమతి తీసుకోలేదని, అడ్డుపడి తీరతామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ముద్రగడ మాత్రం అనుమతి అవసరం లేదంటున్నారు. కాపు జేఏసీ కూడా అదే చెబుతోంది. కానీ ఇక్కడ సామాన్యుడికి అర్థంకాని ప్రశ్నేంటంటే.. అనుమతి కోసం అంత పట్టుదలేమిటోనని. కానీ అసలు లిటిగేషన్ అంతా అక్కడే ఉంది.
పాదయాత్రకు అనుమతి అడగ్గానే పోలీసులు ఇవ్వరు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నాదే బాథ్యత అని అఫిడవిట్ అడుగుతారు. అప్పుడు అనుమతిస్తారు. అలా అఫిడవిట్ ఇస్తే ముద్రగడ బుక్కైనట్లే. ముద్రగడ బ్యాచ్ లో ఏ ఆకతాయి ఏం చేసినా ఆయనకే చుట్టుకుంటుంది. అందుకే ఆయన పర్మిషన్ అంటే పారిపోతున్నారు.
అటు ప్రభుత్వం కూడా తుని ఘఠన తర్వాత సీరియస్ గా ఉంది. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో రైలు తగలబడటంపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అందుకే పాలిటిక్స్ కంటే లా అండ్ ఆర్డర్ ప్రధానమని భావిస్తోంది సర్కారు. కాపులకు తాము ఏదోలా నచ్చజెప్పుకుంటామని, కానీ సర్కారుకు చెడ్డపేరు వస్తే అది ఎవ్వరూ పోగొట్టలేరనేది ఏపీ ప్రభుత్వ భావన.
మరిన్ని వార్తలు