టీడీపీ స్టేట్ ఆఫీస్ శంకుస్థాపన ముహూర్తం ఇదే.

Muhurtham-set-for-tdp-state

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ జాతీయ కార్యాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఇప్పటిదాకా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా నడుస్తున్న పార్టీ కార్యక్రమాలు ఇది పూర్తి అయితే ఇక్కడ నుంచే జరుగుతాయి. ఇంతకుముందే పార్టీ కార్యాలయం కోసం సర్కార్ టీడీపీ కి స్థలం కేటాయించింది. మంగళగిరి మండలం ఆత్మకూరు దగ్గర ఈ కేటాయింపు జరిగింది. అక్కడ మొత్తం నాలుగు బ్లాక్ లుగా కార్యాలయం నిర్మించబోతున్నారు. ఈ సరికొత్త కార్యాలయ డిజైన్ మీద కూడా ఎంతో కసరత్తు జరిగింది. చివరకు బాబు ఓ డిజైన్ ని ఎంపిక చేశారు.

Chandrababu-happy-aboput-on

ఈ నెల 26 న ఉదయం 5 గంటల 17 నిమిషాలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా టీడీపీ జాతీయ కార్యాలయం శంకుస్థాపన జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఎన్నికలను ఇక్కడ నుంచే ఎదుర్కోడానికి టీడీపీ సన్నద్ధం అవుతోంది.