“నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా పవన్ ను చంపేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు” అని నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర కలకలం రేపాయి. తన హత్యకు కుట్రపై ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్న కాల్ రికార్డును తాను విన్నానని, మొత్తం ముగ్గురు కుట్ర పన్నారని, వారు ఎవరో తనకు తెలుసునని, అయినా ప్రస్తుతానికి వారి పేర్లను బయట పెట్టనని పవన్ నిన్న వ్యాఖ్యానించి కలకలం రేపారు. దీంతో ఆ ముగ్గురూ ఎవరన్న కొత్త చర్చ మొదలైంది. అసలు పవన్ ను హత్య చేయాలని ఎవరు కుట్ర పన్నుతారు? ఆయన మరణిస్తే లాభం ఎవరికి? అన్న కోణంలో చర్చించుకుంటున్నారు. ఇక పవన్ వద్ద కాల్ రికార్డు ఉంటే, నేరుగా దాన్ని పోలీసులకు ఎందుకు అప్పగించలేదని, వారిపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.
ఒకప్పుడు ఇలాగే శ్రీ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని ఉచిత సలాహా ఇచ్చిన పవన్ తన దగ్గర ఆ కాల్ వివరాలు ఉంటె ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాడు అని జనాలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు పవన్ కల్యాణ్ అంటే ఎక్కడ లేని క్రేజ్. అడుగడుగునా గౌరవం. కానీ, ఆయన ఫుల్ టైం పొలిటీషియన్‌గా మారాలని ప్రయత్నిస్తున్నకొద్దీ ఆయన ఇమేజికి జరుగుతున్న డ్యామేజీ ఎక్కువైపోతోంది. ఎందుకంటే పవన్ మాటలు అలా ఉంటున్నాయి. ఆయన నిరాధారా ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఆరోపించడం ఆరోపించబడ్డవారు సవాల్ చేస్తున్నా ఆయన ఏమీ అనలేకపోతున్నారు. ముందు లోకేష్ అవినీతి గురించి అలాగీ కామెంట్ చేసిన ఆయన ఆ తర్వాత ఆధారాలు అడిగితే ఎవరో చెబితే విన్నానని కవర్ చేసుకునే ప్రయత్నం చేసారు. ఇక ఈరోజు ఈ హత్యా కుట్ర విషయం కూడా మళ్ళీ ఏమీ మాట్లడకపోవడంతో అసలు పవన్ నిజమే మాట్లాడుతున్నారా ? లేదా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఏమో ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ కు విక్రమార్కుడికి ఉన్నట్టు నిజం చెబితే తల వెయ్యి ఒక్కలు అయ్యే భేతాళ శాపం ఏమైనా ఉందా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక హత్యకు కుట్ర చేసిన వారి వివరాలను బహిర్గతం చేయకుండా, కేవలం ఆరోపణలు చేయడం వెనుక, రాజకీయ ప్రయోజనాలను ఆయన ఆశిస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.