Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య, సమంతలు ఇటీవలే పెళ్లి చేసుకున్నారుగా, అప్పుడే గుడ్ న్యూస్ ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అవును ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పగలను. అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాగచైతన్య, సమంతల కాంబో మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చి, సక్సెస్ అయ్యాయి. అయితే పెళ్లి అయిన తర్వాత వీరిద్దరు కలిసి నటించాలని చాలా మంది ఆశిస్తున్నారు. వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. సినీ వర్గాల వారు పలువురు సమంత, చైతూ జతగా చూడాలని, కలపాలని ప్రయత్నాలు చేశారు. ఆ అవకాశం ప్రముఖ రచయిత కోన వెంకట్‌కు దక్కింది.
పలు చిత్రాలకు కథలు అందించి సూపర్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ తాజాగా నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. నాని హీరోగా నివేదా థామస్ హీరోయిన్గా ‘నిన్ను కోరి’ అనే చిత్రాన్ని శివ నిర్వాన అనే దర్శకుడితో కోన నిర్మించాడు. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. శివ దర్శకత్వంలో కోన వెంకట్ ఒక క్యూట్ లవ్ స్టోరీతో సినిమాను నిర్మించబోతున్నాడు. ఆ సినిమాలో నాగచైతన్య మరియు సమంతలను నటించేందుకు ఒప్పించాడు. ప్రస్తుతం చైతూ నటిస్తున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదల అయిన వెంటనే సమంతతో కలిసి చిత్రాన్ని చేసేందుకు చైతూ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి నాగచైతన్య, సమంతలు కలిసి నటించబోతున్న సినిమా రానుండటంతో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. చై, సామ్.. ఒక గుడ్ న్యూస్