Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోకు ప్రేక్షకుల విశేష ఆధరణ దక్కుతుంది. ఈ షో కారణంగా స్టార్ మాటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగి పోయింది. తెలుగులో నెం.1 ఛానెల్‌గా స్టార్ మాటీవీ స్థానం దక్కించుకుంది. ఈ షోకు భారీగా ఆధాయం వస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. షోకు భారీగా ప్రేక్షకాధరణ ఉన్న నేపథ్యంలో సినిమాలను కూడా ఈ షో ద్వారా ప్రమోట్ చేసుకునేందుకు ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఆనందో బ్రహ్మా’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలను బిగ్‌బాస్ ద్వారా ప్రమోట్ చేయడం జరిగింది. తాజాగా ‘యుద్దం శరణం’ చిత్రాన్ని కూడా బిగ్‌బాస్‌లోకి తీసుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.
నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా శ్రీకాంత్ మొదటి సారి విలన్‌గా నటించిన ‘యుద్దం శరణం’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఏ ఒక్కరికి తెలియదు. హఠాత్తుగా సినిమా విడుదల తేదీని ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చారు. ఎక్కువగా పబ్లిసిటీ చేయని కారణంగానే బిగ్‌బాస్ ద్వారా ఈ సినిమాను ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాగచైతన్య బిగ్‌బాస్ షోలో పాల్గొనబోతున్నాడు. గత వారం బాలకృష్ణ బిగ్‌బాస్ ఇంటికి వెళ్తాడని అంతా భావించారు. కాని అది ఒట్టి వార్తే అయ్యింది. కాని ఈసారి మాత్రం ఖచ్చితంగా చైతూ బిగ్‌బాస్ ఇంటికి వెళ్లబోతున్నాడు.
మరిన్ని వార్తలు: