Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమంత ప్రేమలో తడిసిముద్దవుతున్న అక్కినేని అందగాడు నాగచైతన్య కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఓ దశలో ఏంటోఅని చైతు స్టోరీ సెలక్షన్ మీద నొసలు చిట్లించిన వాళ్లంతా ఇప్పుడు ఆయన సినిమాల వైపు ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా చూస్తున్నారు. తాజాగా నాగచైతన్య హీరోగా చేస్తున్న సవ్యసాచి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే సినీ అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. ఫస్ట్ లుక్ తో సవ్యసాచి అంటే అర్ధం ఏంటో చెప్పేందుకు ప్రయత్నించాడు దర్శకుడు చందు మొండేటి. నాగచైతన్య రెండు చేతుల్లో రెండు ఆయుధాలతో కనిపిస్తున్నాడు. నిజానికి సవ్యసాచి అన్న మాటకు అర్ధం ఏమిటంటే రెండు చేతులతో ఆయుధాలు ప్రయోగించగలిగినవాడు. భారతంలో అర్జునుడు ఈ విధంగా రెండు చేతులతో బాణాలు వేయగల సామర్ధ్యం కలిగివుంటారు . అందుకే ఆయన్ని సవ్యసాచి అనేవాళ్ళం. ఇప్పుడు అదే టైటిల్ తో డిఫరెంట్ ఆయుధంతో వస్తున్న నాగచైతన్య ఈ సినిమాతో ఇంకో భారీ విజయం సాధించగలడని ఆశిద్దాం.
మరిన్ని వార్తలు: