ఈపీఎస్ సీటుకు ఎసరొచ్చిందా..?

cm-palanswamy-in-trouble-with-dmk-stalin-and-dinakaran

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తమిళనాడు సీఎం పళనిస్వామి కుర్చీ కిందకు నీళ్లొచ్చే అవకాశాలు ఉన్నాయి. అదీ ఎవరో ప్రత్యర్థి వర్గం చెప్పింది మాత్రం కాదు. స్వయంగా ఆయన క్యాబినెట్లో కీలక మంత్రి, రిసార్ట్ పాలిటిక్స్ లో కూడా ప్రధాన పాత్ర పోషించిన దిండుగల్ శ్రీనివాసన్ నోరు జారారు. తమ ప్రభుత్వం మెజార్టీకి -2 అయిందని చెప్పడం తమిళ పాలిటిక్స్ లో కలకలం రేపింది.

కానీ ఈపీఎస్ కు బలం తక్కువైనా నష్టం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం ఆయనకు వ్యతిరేకంగా ఓటేయడానికి ముందుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు డీఎంకే కూడా ముందుకు వచ్చి చేసేదేమీ లేదు. కానీ ఏదో ప్రయత్నం చేయాలని మాత్రం స్టాలిన్ గట్టిగా అనుకుంటున్నారు. మరి ఆయనకు ఎవరు కలిసొస్తారనేది ఆసక్తికరం.

ఇంతలో సందట్లో సడేమియాలాగా ఎంటరైన దినకరన్ .. తన వర్గం ఎమ్మెల్యేలతో ఏదో చేద్దామనుకుంటున్నారు. మరికొంతమందిని పళని వర్గం నుంచి లాగేయాలని చూస్తున్నారు. మరోసారి రిసార్ట్ పాలిటిక్స్ నడిపైనా సరే ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు:

కిమ్ దూకుడుకు తగ్గిన ట్రంప్

కుక్కకాటుకు చెప్పుదెబ్బ