Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగశౌర్య, షామిలి జంటగా తెరకెక్కిన ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించేలా, కుటుంబ విలువలు పెంపొందించేలా ఉందని విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. తప్పకుండా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందనే నమ్మకంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కాని అంచనాలు తారు మారు అవుతున్నాయి. ఈ చిత్రంతో పాటు విడుదలైన నేలటిక్కెట్టు చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినా కూడా అమ్మమ్మగారిల్లు మంచి వసూళ్లను రాబట్టలేక పోతుంది. కారణం ఈ చిత్రంకు మహానటి గట్టి పోటీ ఇస్తుంది.
విడుదలై మూడు వారాలు కావస్తున్నా కూడా ఇంకా మంచి జోరుగా వసూళ్లను మహానటి చిత్రం రాబడుతుంది. మొదటి వారం సాదారణంగా వచ్చిన కలెక్షన్స్ రెండవ వారం నుండి భారీగా వస్తున్నాయి. మహానటి జోరు మరో వారం నుండి రెండు వారాలు కొనసాగే అవకాశాలున్నాయి అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాక్ పాజిటివ్‌గానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం నెగటివ్‌గా ఉన్నాయి. రెండు వారాల తర్వాత వచ్చి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సేఫ్ జోన్లో ఇలాంటి సినిమాలు వస్తే తప్పకుండా మంచి వసూళ్లను రాబట్టేది అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ఆడటం కష్టమే అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు.