శ్రీరెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు ప్రెస్‌మీట్‌

nagababu press meet about sri reddy comments

  Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పవన్‌ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులు మరియు ఫ్యాన్స్‌ రెస్పాండ్‌ అవుతూ వచ్చారు. తాజాగా ఈ వివాదంపై మెగా బ్రదర్‌ నాగబాబు కూడా స్పందించాడు. మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఆఫీస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాగబాబు తమ కుటుంబంపై, సినిమా పరిశ్రమపై కొందరు చేస్తున్న విమర్శలను తీవ్రంగా తప్పుబట్టాడు. తాను ఒక వ్యక్తి గురించి, ఒక ఛానెల్‌ గురించి విమర్శలు చేసేందుకు ఇక్కడకు రాలేదు అని, సినిమా పరిశ్రమలో ఏ ఒక్కరి గురించి తప్పుగా మాట్లాడిన అందరికి బాధగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేయడం ఎప్పటికి మంచి పద్దతి కాదని, తన సోదరుడిని విమర్శించే హక్కు ఎవరికి లేదు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

పవన్‌ కళ్యాణ్‌ ప్రతి విషయంలో స్పందించాలి అంటే కుదరదు అని, తను ప్రజా జీవితంలో ఉన్నాడు. ప్రజల కోసం మంచి చేసేందుకు అతడు రాజకీయాల్లో ఉన్నాడు. అలాంటిది అతడు పోలీసులపై ఉన్న గౌరవంతో తను పడుతున్న ఇబ్బందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పడం ఎలా తప్పు అవుతుందని, ఇందులో ఏం తప్పు లేదని, కావాలని రాజకీయ దురుద్దేశ్యంతోనే పవన్‌పై వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా నాగబాబు చెప్పుకొచ్చాడు. నా తమ్ముడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఒక వేళ అతడు తప్పు చేస్తే నలుగురిలో నిల్చుని తాను ఆ తప్పు చేశాను అంటూ ఒప్పుకునే దమ్ము ఉందని, ఆ దమ్ము మీకు ఉందా అంటూ నాగబాబు ప్రశ్నించాడు.

సినిమాల్లో పవన్‌ నెం.1 స్టార్‌ అయినా, కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా కూడా రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఇలా విమర్శించడం ఏమాత్రం సమంజసం కాదని ఈ సందర్బంగా నాగబాబు చెప్పుకొచ్చాడు. పవన్‌ నిశబ్దంగా ఉన్నంత మాత్రాన చేతకాని వాడు అని భావించవద్దని హెచ్చరించాడు. పవన్‌ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరికి త్వరలోనే సమాధానం దక్కుతుందని నాగబాబు వారిని సున్నితంగా హెచ్చరించాడు.

మా అమ్మను అవమానిస్తూ మాట్లాడటంతో చాలా మంది సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. ఇదే విషయాన్ని మా అమ్మ వద్ద చెప్పాను. ఆమె ఏదో బాధలో ఉండి అలా అని ఉంటారు వదిలేయాంటూ సూచించారని, ఎవరు కూడా ఆమెను దూషించిన వారిపై దాడి చేయద్దని అమ్మ చెప్పిందని నాగబాబు చెప్పుకొచ్చాడు. ఈ ప్రెస్‌మీట్‌లో నాగబాబు కాస్త ఆవేశ పూరితంగా మాట్లాడాడు.