విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా పరుశురామ్ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ‘గీత గోవిందం’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం అన్ని విషయాల్లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. కాని ఒక్క విషయంలో మాత్రం ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అదే నాగబాబు పాత్ర విషయం. విజయ్ దేవరకొండకు తండ్రిగా నాగబాబు కనిపించిన విషయం తెల్సిందే. నాగబాబు పాత్ర నిడివి తక్కువ ఉండటంతో పాటు, నాగబాబుకు మరెవ్వరో డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలు కొందరికి రుచించడం లేదు. నాగబాబు పాత్రను ఇంకాస్త ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేదనేది కొందరి వాదన.
కథానుసారంగా హీరో పాత్రకు తండ్రి పాత్ర కొద్ది సమయం మాత్రమే కనిపించాలి. మరి పెంచినా కూడా కథను మార్చాల్సి ఉంటుంది. దర్శకుడు పాత్ర కోసం కథను మార్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే నాగబాబు గత కొన్నాళ్లుగా గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. ప్రతి వారం ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో చూసేవారికి ఆయన వాయిస్ ఎలా ఉందో తెలిసి పోతుంది. ఎక్కువ సమయం మాట్లాడలేక పోవడంతో పాటు, సరిగా మాట రాకపోవడంతో నాగబాబు ఈ చిత్రం కోసం డబ్బింగ్ విషయంలో వేరే వారిపై ఆధారపడాల్సి వచ్చింది. నాగబాబు పాత్ర చిన్నదే కనుక డబ్బింగ్ విషయంలో ఇబ్బంది ఏమీ ఉండదని చిత్ర యూనిట్ సభ్యులు భావించి ఉంటారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం నాగబాబు విషయంను ఈ చిత్రానికి మైనస్ అన్నట్లుగా చిత్రీకరించేలా చూస్తున్నారు.