Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా, ఏ మాట్లాడినా కూడా సంచలనమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వర్మ ఈ మద్య తీసిన ఏ ఒక్క చిత్రం కూడా ఆకట్టుకోలేక పోయింది. అయినా కూడా ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రానికి భారీ డిమాండ్ ఉంది. నాగార్జునతో చాలా సంవత్సరాల తర్వాత వర్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ కాప్‌గా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా వర్మ నిర్మిస్తున్నాడు. 25 కోట్ల బడ్జెట్‌తో వర్మ కంపెనీలో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ 40 కోట్లకు పైగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వర్మ, నాగార్జున కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇటీవల వర్మ సినిమాలు సక్సెస్ కాకపోయినా కూడా సినీ వర్గాల వారు ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఈ చిత్రం అమ్ముడు పోయే అవకాశం ఉంది. ఇక వర్మకు బాలీవుడ్లో ఉన్న క్రేజ్‌తో హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా 25 కోట్లకు అమ్ముడు పోతాయనే టాక్ వినిపిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని 25 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రంతో వర్మకు కాసుల పంట పండటం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.