ఏయన్నార్‌ బయోపిక్‌ అవసరం లేదు

nagarjuna clarity about ANR Biopic Movie Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈమద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా బయోపిక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ‘మహానటి’ చిత్రంగా సావిత్రి జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్‌’ చిత్రం రాబోతుంది. సంక్రాంతికి ఆ సినిమా విడుదల కాబోతుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక రాజశేఖర్‌ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కత్తి కాంతారావు జీవిత చరిత్రను ‘అనగనగా రాజకుమారుడు’ అంటూ తెర రూపం ఇచ్చేందుకు సన్నాహలు మొదలు అయ్యాయి. ఈ సమయంలోనే అక్కినేని జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం నాగార్జునను కూడా సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ‘ఆఫీసర్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ నాన్నగారి బయోపిక్‌ను తీస్తామంటూ చాలా మంది వచ్చారు. కాని నాన్నగారి బయోపిక్‌ తీయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్‌. ఆయన బయోపిక్‌ను తీసినా ప్రేక్షకులు ఆసక్తిగా చూడరు. ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా సాఫీగా, హాయిగా సాగిపోయింది. సినిమాటిక్‌గా తీస్తాం అంటే ఆయన జీవితంలో కొన్ని లేని పోని విషయాలను జోడివ్వాల్సి వస్తుంది. అందుకే నాన్నగారి జీవిత చరిత్రను తెరకెక్కిస్తాం అంటూ ఎవరు వచ్చినా వారికి నా సమాధానం నో అనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. నాగేశ్వరరావు జీవిత చరిత్ర గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో ఉన్న విషయాన్ని సినిమా రూపంలో తీసుకు వస్తే ఏంటీ అనేది కొందరి ప్రశ్న. అక్కినేని అభిమానులు సైతం ఏయన్నార్‌ జీవిత చరిత్రను సినిమా రూపంలో కోరుకుంటున్నారు