Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంకర్‌గా గుర్తింపు పొంది, ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఓంకార్ మొదటి సినిమా ‘జీనియస్’ను తెరకెక్కించాడు. ఆ సినిమా సక్సెస్ అయినా కూడా భారీ బడ్జెట్ అవ్వడంతో నష్టాలను మిగిల్చింది. అందుకే దర్శకుడు ఓంకార్ తన స్థాయికి తగ్గట్లుగా సినిమాలను తెరకెక్కించాలని భావించి చేసిన చిత్రం ‘రాజుగారి గది’. కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా ఏకంగా 10 కోట్ల వసూళ్లు సాధించిన విషయం అందరికి తెల్సిందే. ఆ సినిమా సాధించిన విజయంతో నాగార్జునతో ఒక సినిమాను చేసే అవకాశాన్ని ఓంకార్ దక్కించుకున్నాడు. ‘రాజుగారి గది 2’ అంటూ నాగార్జునతో ఓంకార్ సినిమా తెరకెక్కించాడు. ఈనె 13న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సమంత ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. పీవీపీతో పాటు ఈ సినిమా నిర్మాణంలో అధికారికంగా ఓంకార్ మరియు అనధికారికంగా నాగార్జున పాలుపంచుకున్నారు. ఈ ముగ్గురు కలిసి సినిమాను కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారు. ఈ 20 కోట్లలో 6 కోట్లు కేవలం గ్రాఫిక్స్‌కు మాత్రమే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. నాగార్జున మరియు సమంతలు పారితోషికాలు తీసుకోలేదు. లాభాల్లో నాగార్జున షేర్ తీసుకోబోతున్నాడు. ఓంకార్ తన వంతుగా రెండు కోట్లను ఖర్చు చేశాడు. మిగిలినదంతా కూడా పీవీపీ ఖర్చు చేశాడు.
కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా శాటిలైట్ రైట్స్ మరియు ఆన్లైన్ రైట్స్ నిర్మాతల వద్దే ఉన్నాయి. అవి కూడా కలిస్తే మొత్తంగా 50 కోట్ల వరకు బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే కేవలం 20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు ముందే 30 కోట్ల లాభాలను దక్కించుకుందన్న మాట. ఈ సినిమా సక్సెస్ అయితే లాభాలు మరింతగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాగార్జునకు 7 కోట్ల వరకు ఈ సినిమా ద్వారా దక్కిందని, సినిమా సక్సెస్ అయితే మరో మూడు నుండి అయిదు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి నాగార్జునకు మాత్రమే సేఫ్ ప్రాజెక్ట్‌లు తీయడం తెలుసని మరోసారి నిరూపితం అయ్యింది.