శివమణి సినిమా నిజం చేద్దాం అనుకుంటే నిరాశ తప్పలేదు.

nagarjuna shivamani movie story replica in us

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అప్పుడెప్పుడో నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన శివమణి సినిమా గుర్తుందా ? అందులో విలన్ బారిన పడిన హీరోయిన్ తనని ఓ దీవికి తరలిస్తుండగా ప్రియుడికి సందేశం పంపడం కోసం ఓ లేఖ రాసి దాన్ని మూతపెట్టి సముద్రంలోకి విసిరేస్తుంది. ఆ సీసా ఎప్పటికైనా ఏదో ఒడ్డుకి చేరకపోతుందా, తనను వెదుక్కుంటూ ప్రియుడు రాకపోతాడా అని ఎదురు చూస్తుంది. అలాంటిదే ఓ సీన్ నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది?

అమెరికాకి చెందిన హేలీరాబిన్స్ అనే అమ్మాయి తన ప్రియుడు ని వినూత్న పద్ధతిలో ఎంచుకోవాలని భావించింది. ఓ బంతి మీద తన పేరు, ఫోన్ నెంబర్ రాసి సముద్రంలోకి విసిరింది. అది ఎవరో ఒకరికి దొరుకుతుంది. అలా దాని ఆధారంగా ఫోన్ చేసిన వారితో ప్రేమ కి గ్రీన్ సిగ్నల్ ఇద్దాం అనుకుంది. ఇంకా నచ్చితే పెళ్ళికి ఓకే చెప్పాలని భావించింది. ఆమె సముద్రంలో బంతి విసిరిన తర్వాత 6 సంవత్సరాల పాటు హేలీ కి ఫోన్ రాలేదు. ఆమె ఆశలు అడుగంటుతున్న వేళ ఓ రోజు స్నాప్ చాట్ ద్వారా హేలీ కి తనకు బంతి దొరికిందన్న మెస్సేజ్ వచ్చింది.

ఆడమ్ పేరు తో వచ్చిన ఆ మెసేజ్ చూసి హేలీ పొంగిపోయింది. తీరా ఫోన్ చేసేసరికి ఆమె ఆనందం ఆవిరి అయ్యింది. అస్లే అనే అమ్మాయి ఆడమ్ పేరుతో స్నాప్ చాట్ కోసం Id తయారు చేసుకుంది. అలా బంతి రాయబారం 6 ఏళ్ల తర్వాత ఓ అమ్మాయికి చేరడంతో హేలీ తెగబాధపడిపోతోంది. మొత్తానికి నిజం జీవితంలో జరిగిన ఇలాంటి ఆలోచన అంతకు ముందే పూరికి తట్టడం గ్రేట్ . కాదంటారా ?