గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల ప్రెస్ మీట్ మెయిన్ పాయింట్స్
మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్
- కేంద్ర పభుత్వం రాయితీలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతుంది
- దేశంలో ఏపార్టీకి లేనటువంటి క్రమశిక్షణ కలిగిన శక్తివంతమైన కార్యకర్తలు తెదేపాకు ఉన్నారు.
- రాష్ట్రంలో 55 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం
- జగన్మోహన రెడ్డి సీఎం పదవి చేపడితే ఏవిధంగా పరిపాలిస్తాడు..
- చంద్రన్నబాట ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కిలోమీటర్ల రోడ్లు వేశాం
- నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారు.. క్రమ శిక్షణ అనేది ముఖ్యం.. నోరు ఉందని మాట్లాడితే..అభసూపలుఅవుతారు.
- పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ మాట్లాడిన తీరు తప్పు..
- 14 నెలలు జైల్లో ఉండి అవినీతి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు..
- జగన్ దోపిడిదారుడు, గజదొంగ
- పశ్చిమగోదావరిలో అభివృద్ధి రికార్డు స్థాయిలో జరుగుతుంది
- గాంధీ, అల్లూరి సీతారామరాజు,మహాత్మాగాంధీ తో పోల్చుకోవడం జగన్ అవివేకం
- కళ్ళు మూసుకొని ఏవరో చెప్పిన మాటలు చెప్పడం మానుకోవాలని పవన్ కళ్యాణ్ కు నా యొక్క సూచన
- బిసిల ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు
- అవినీతిలో సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి, నటించడంలో సూపర్ స్టార్ పవన్ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడంలో సూపర్ స్టార్ చంద్రబాబు
మంత్రి శిద్దా రాఘవరావు కామెంట్స్
- రాష్ట్రంలో సమస్యలు లేవు. రాష్ట్రంలో అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారు.
- గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ప్రజలు అతి తక్కువ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.
- రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.
- పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల అభివృద్ధిని నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించాం.
- విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపా అధికారంలోకి వస్తుంది.
- సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.
మంత్రి ఆనంద బాబు కామెంట్స్
- ప్రజలు రాజకీయాలు ఎటుపోతున్నాయి అని బాధపడుతున్నారు..
- అధికారం దాహంతో , తండ్రీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఏమాత్రం అవగాహన లేని పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడన్నారు..
- ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలు తెలుగుదేశం పార్టీవైపు ఉన్నారు..
- నరేంద్రమోదీ తో కుమ్మకై న జగన్మోహన్ రెడ్డి ,పవన్ కళ్యాణ్ అంటగతున్నారు.. కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం వీరికి లేదు..
మంత్రి పుల్లారావు రావు కామెంట్స్
- కేంద్రప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకోని కుట్ర చేస్తుంది
- కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే పవన్ వ్యాఖ్యలు
- జగన్ కు పాదయాత్ర పూర్తి అయ్యే సరికి మతి భ్రమిస్తుంది
- రెచ్చగొట్టే మాట్లలు మాట్లాడితే రైతులే నీపై తిరగబడతారు.
- అమరావతి రాజధాన్ని నిలిపివేసే హక్కు పవణ్ కళ్యాన్ కు ఏవరు ఇచ్చారు.
- అమరావతి 5 కోట్ల ప్రజల కళల రాజధాని
- నిరంతర పర్యవేక్షణతో పోలవరం పనులు అతివేగంగా జరుగుతున్నాయి
- పాదయాత్ర ముగిసే సమయానికి జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఎదో ఇక ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి వస్తుంది..
- చంద్రబాబు కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు.
- జగన్మోహన్ రెడ్డికి అధికారం ఎండమావుగానే మిగులుతుంది.