బాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ తనూశ్రీ దత్తా తాజాగా బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 2008లో ఒక సినిమా షూటింగ్ సమయంలో డాన్స్ నేర్పిస్తానంటూ నా వద్దకు వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడని, నన్ను లైంగికంగా వేదించాడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. చేసేవన్ని పాడు పనులు, పైకి మాత్రం సమాజ సేవ, రైతుల అభ్యున్నతి అంటూ కలరింగ్ ఇస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై తాజాగా బాలీవుడ్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన నానా పటేకర్‌పై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం ఏంటీ అంటూ ఆమె పై బాలీవుడ్ సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు నానా పటేకర్ కూడా స్పందించాడు. ఆమె చేసిన వ్యాఖ్యలకు తాను స్పందించాల్సిన అవసరం లేదు. కాని మీడియాలో మరింతగా ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారనే ఉద్దేశ్యంతో నేను ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు. అసలు లైంగిక వేదింపులు అంటే ఏంటో నాకు చెప్పండి. ఆమె పట్ల నేను అనుచితంగా ప్రవర్తించినట్లుగా చెబుతున్న సమయంలో దాదాపు 100 మంది పక్కన ఉన్నారు. వారందరి ముందు లైంగిక వేదింపులకు పాల్పడతారా అంటూ నానా పటేకర్ అన్నాడు. నాపై చేసిన ఆరోపణలకు ఆమెకు లీగల్‌గానే సమాధానం చెబుతాను అంటూ నానా పటేకర్ అన్నాడు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.