Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుసగా ఎన్ని సక్సెస్‌లు వచ్చినా కూడా నాని ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నిలువలేక పోయాడు, ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా ఒక మోస్తరు సక్సెస్ లేదా సూపర్ హిట్‌ను అందుకున్నా కూడా 30 కోట్ల లోపు వసూళ్లు సాధిస్తున్నాయి. కాని ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు మినిమం 50 కోట్ల మేరకు వసూళ్లు సాధిస్తున్నాయి. నాని ఆ రేంజ్‌కు రావాలి అంటే స్టార్ దర్శకుల సినిమాలో నటించాల్సి ఉంది. కాని నాని ఇప్పటి వరకు రాజమౌళి మినహా పెద్ద దర్శకుల సినిమాలో నటించింది లేదు. దాంతో నానికి సక్సెస్‌లు అయితే వస్తున్నాయి, కాని స్టార్డం రావడం లేదు. అయితే త్వరలో నాని చేయబోతున్న సినిమాతో స్టార్డం రావడం ఖాయం అని, నాని రేంజ్ ఆ చిత్రంతో పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
టాలీవుడ్లో వరుసగా బిగ్గెస్ట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం మహేష్‌బాబుతో ‘భరత్ అను నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు త్వరలో నానితో సినిమాను చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు వసూళ్ల పరంగా టాలీవుడ్ టాప్ చిత్రాల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం చేస్తున్న భరత్ అను నేను చిత్రం కూడా ఖచ్చితంగా టాప్ 10లో ఉండటం ఖాయం అంటున్నారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తే నాని రేంజ్ ఖచ్చితంగా పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.