Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సాఫీగా బండి నడుస్తున్నప్పుడు డ్రైవర్ సామర్ధ్యం తెలియదు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ఆ డ్రైవర్ సామర్ధ్యం బయటపడుతుంది. ఇది ఒక్క డ్రైవింగ్ విషయంలోనే కాదు మనిషికి, అతని జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు నారా బ్రాహ్మణి విషయంలోనూ ఓ సవాల్ ఆమె సామర్ధ్యాన్ని బయట పెట్టింది.హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఆమె హెరిటేజ్ ప్రతినిధిగా పాల్గొన్నారు.
ఇవంకా ట్రంప్, ప్రధాని మోడీ, ఇంకా పలువురు అంతర్జాతీయ స్థాయి మహిళా పారిశ్రామిక వేత్తలు పాల్గొన్న ఈ సదస్సు నుంచి బయటకు వస్తున్న బ్రాహ్మణిని ఓ ఛానల్ విలేకరి చౌకబారు ప్రశ్న ఒకటి అడిగారు. హైదరాబాద్ లో ఈ సదస్సు జరగడం అసూయ కలిగిస్తోందా అని. ఆ ప్రశ్నకు ఓ రేంజ్ లో బ్రాహ్మణి సమాధానం ఇచ్చారు. తన గౌరవం కోల్పోకుండానే ప్రశ్న అడిగిన వ్యక్తి నీళ్లు నమిలేలా చేయగలిగారు బ్రాహ్మణి.
బ్రాహ్మణి ఇచ్చిన సమాధానం ఇలా వుంది . “ సదస్సు ఎక్కడ జరుగుతుందన్నది ముఖ్యం కాదు . దాని నుంచి ఏమి నేర్చుకున్నాం , ఎంత స్ఫూర్తి పొందాం అన్నదే ముఖ్యం. అమరావతిలో కిందటేడాది అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ జరిగింది. అలాగే ఇది. అయినా మీలాగా మేము ఆలోచించలేం” అంటూ బ్రాహ్మణి ఇచ్చిన సమాధానంతో ఆ ప్రశ్న వేసిన రిపోర్టర్ కి దిమ్మ తిరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో రజని పంచ్ డైలాగ్ తరహాలో బ్రాహ్మణి సమాధానం వైరల్ అవుతోంది.
ఇక ప్రత్యక్ష రాజాకీయాల్లోకి ఏళ్ళ కొద్దీ నలిగిన వాళ్ళే ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి అంటే తడబడతారు. అయితే ఆ అనుభవం లేకపోయినా సమయస్ఫూర్తితో , గౌరవప్రదం గా సమాధానం ఇస్తూనే ఎదుటి వారిని డిఫెన్స్ లోకి నెత్తిన బ్రాహ్మణి సామర్ధ్యం చూస్తుంటే నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.