Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోకేష్ రాష్ట్రమంత్రి వర్గంలోకి వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా నిన్న అమరావతి సెక్రెటరియేట్ లో పండగ వాతావరణం నెలకొంది. ఆయన ఛాంబర్ వద్ద నిన్నంతా ఫుల్ హడావిడి. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులూ పెద్దసంఖ్యలో వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక లోకేష్ ఈ సందర్భంగా ప్రముఖ పత్రికలు, టీవీలకు ఇంటర్వ్యూ లు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూల్ని స్పెషల్ గా చూసిన ఆయా సంస్థల యాజమాన్యాలు హైదరాబాద్ నుంచి బ్యూరో చీఫ్ స్థాయి లేదా కాస్త కీలక స్థానాల్లో వున్న వారిని అమరావతి పంపాయి. కెమెరా మెన్స్ కూడా దాదాపు హైదరాబాద్ నుంచే వచ్చారు. ఈ సందర్భంగా మీడియాకి లోకేష్ ఛాంబర్ వద్ద గౌరవమర్యాదలు, అతిధి సత్కారాలు బాగా జరిగాయి. హైదరాబాద్ లో ఉక్కిరిబిక్కిరి ట్రాఫిక్, హడావిడి నుంచి వచ్చిన వారికి అబ్బా ఇక్కడ ఎంత బాగుంది అనుకోవడం మొదలు పెట్టారు.
అమరావతిలో పని చేయడం బాగుంది , మీరంతా అదృష్టవంతులు అనుకుంటూ తమ సంస్థల్లో స్థానికంగా పని చేసే ఉద్యోగుల్ని పొగడడం మొదలెట్టారు. అయితే ఎప్పుడో ఒక్కసారి పండక్కి వచ్చి మర్యాదలు చూసిపోయే వారికి రోజువారీ తాము ఇక్కడికి రావడానికి పడుతున్న ఇబ్బందులు చెప్పలేక వాళ్ళు సతమతమయ్యారు. ఏడవలేక ఓ నవ్వు నవ్వి ఆ పరిస్థితి నుంచి అప్పటికప్పుడు బయటపడ్డారు. కొంత మంది మాత్రం అంతగా నచ్చితే ట్రాన్స్ఫర్ మీద వచ్చి ఎంజాయ్ చేయమని నర్మగర్భంగా అన్నారట.
మరిన్ని వార్తలు: