అడవి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గూఢచారి’ చిత్రంపై విమర్శకుల ప్రశంసలు కురిసిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రానికి రివ్యూవర్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సమయంలోనే సినీ వర్గాల వారి నుండి కూడా సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. సెలబ్రెటీలు ఈ చిత్రాన్ని చూసి తమ స్పందన చెబుతున్నారు. స్పై చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం అమితంగా నచ్చుతుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా అభిమానిస్తూ, ఆధరిస్తున్నారు. బి, సి సెంటర్ల వారు ఈ చిత్రంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ సమయంలోనే ఏపీ యువ నేత, మంత్రి నారా లోకేష్ ఈ చిత్రంపై స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు.
ఆదివారం ‘గూఢచారి’ చిత్రాన్ని చూసిన నారా లోకేష్ స్పందిస్తూ.. సినిమాలోని ప్రతి సీన్‌ను, ప్రతి నిమిషం ఎంజాయ్ చేశాను. అడవి శేషు, శోభిత, ప్రకాష్ రాజ్ అంతా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సినిమాకు యూనిట్ సభ్యులు చాలా కష్టపడ్డట్లుగా అనిపించింది. వారి కష్టంకు ఇది మంచి ఫలితం అంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడంతో చిత్ర యూనిట్ సభ్యులకు బూస్ట్ దక్కినట్లయ్యింది. ఈ చిత్రంతో నాగార్జున మేనకోడలు, పవన్ మొదటి సినిమా హీరోయిన్ అయిన సుప్రియ రీ ఎంట్రీ ఇచ్చింది. 22 ఏళ్ల తర్వాత సుప్రియ రీ ఎంట్రీ ఇవ్వడంతో కూడా ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. సినిమాలో సుప్రియ పాత్రకు మంచి రెస్పాన్క్ దక్కింది. ఈ సినిమా సక్సెస్‌తో సుప్రియా నటిగా కంటిన్యూ అవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని నారా లోకేష్‌తో పాటు ఇంకా పలువురు ప్రముఖులు అభినందించడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.