Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నూతన రాజధాని అమరావతి సమీపంలోని మంగళగిరి వద్ద కొత్తగా ఏర్పాటు అవుతున్న ఐటీ కంపెనీలను ప్రారంభించిన ఏపీ మంత్రి లోకేష్ ఆ రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో కొన్ని బులెట్ పాయింట్స్ మీ కోసం.
2014 లో రాష్ట్ర విభజన జరిగింది. కష్టపడి నిర్మించుకున్న సైబరాబాద్ తెలంగాణ కు వెళ్లిపోయింది
-
రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితిలో పరిపాలన ప్రారంభించాం
-
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు వారికి నా కృతజ్ఞతలు
-
విభజన చేసిన వారు అసూయ పడే విధంగా రాష్ట్రాన్ని గత మూడున్నర ఏళ్లలో అభివృద్ధి చేసుకున్నాం
-
రాజధాని అంటే రోడ్లు, భవనాలు నిర్మించడమే కాదు. ప్రజా రాజధాని నిర్మించాలి
-
ప్రజా రాజధాని కావాలి అంటే ఉద్యోగాలు, ఉపాధి ఇక్కడే రావాలి
-
ఒక్కప్పుడు రాళ్లు, రప్పల మధ్య సైబరాబాద్ ఏర్పాటు అయ్యింది
-
ఒక్క సైబర్ టవర్ వలన ఇప్పుడు హైదరాబాద్ లో 6 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయి
-
ఎంతో కష్ట పడి నిర్మించుకున్న రాజధాని, సైబరాబాద్ పోయింది అన్న భాద. అంతకు మించి అభివృద్ధి సాధించాలి అన్న కసితో పనిచేస్తున్నాం
నేను మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత 2019 లోపు లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
-
గత 9 నెలల్లోనే ఐటి రంగంలో 24 ఉద్యోగాలు కల్పించాం
ఒక్క మంగళగిరి ఐటి క్లస్టర్ లో 10 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి
-
ఇప్పటి వరకూ మంగళగిరి క్లస్టర్ లో 25 కంపెనీలు, 2 వేల ఉద్యోగాలు వచ్చాయి
-
ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రా వ్యాలీ ఏర్పాటు చెయ్యాలి అని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేసారు
-
ఒక్క సైబరాబాద్ కోల్పోయాం. అందుకే నాలుగు సైబరాబాద్లు నిర్మించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
-
విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురం లో నాలుగు ఐటి క్లస్టర్లు రాబోతున్నాయి
-
సైబరాబాద్ పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్ గుర్తువస్తుంది
-
అలానే ఇప్పుడు తిరుపతి పేరు చెప్పగానే జోహో గుర్తుకొస్తుంది
-
విశాఖ కు పెద్ద కంపెనీలు అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్ట్న్, ఏఎన్ఎస్ఆర్,కాన్డ్యూయెంట్, పేటిఎం లాంటి వస్తున్నాయి
-
అమరావతి కి హెచ్ సిఎల్ వచ్జింది. అమరావతి డేటా సెంటర్ హబ్ గా మారబోతుంది
-
అనంతపురంలో బెంగుళూరు ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్ పేరుతో త్వరలోనే క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం
-
ఒక్కో క్లస్టర్ లో 2.5 లక్షల ఉద్యోగాలు, పది ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం
-
మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు.మన రాష్ట్రంలో అప్పుడు ఒక్క ఫోన్ కూడా తయారు కాలేదు
-
కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న 10 ఫోన్లలో 2 మన రాష్ట్రంలో తయారు అవుతున్నాయి
-
ఐటి కంపెనీలను ఆకర్షించడానికి డిటిపి పాలసీ తీసుకొచ్చాం.ఫార్చ్యూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఐఐటి పాలసీ తీసుకొచ్చాం
-
ఐటి రంగం పూర్తి స్థాయి లో అభివృద్ధి చెందాలి అంటే కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు చిన్న, మధ్య తరగతి కంపెనీలు కూడా రావాలి.
-
మీ రాష్ట్రానికి ఎందుకు రావాలి?మీ రాష్ట్రంలో ఏమి ఉంది అని కొంత మంది ఐటి కంపెనీల ప్రతినిధులు నన్ను అడిగారు
-
వారికి నేను ఒక్కటే చెప్పాను. మా రాష్ట్రంలో అద్భుతమైన యువతి, యువకులు ఉన్నారు. అందుకే మా రాష్ట్రానికి రండి అని వారిని కొరాను.
-
స్టార్ట్ అప్ కంపెనీలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నాం
-
ఎక్స్ఎల్ఆర్ 8 యాసిలిరేటర్ ద్వారా పెద్ద ఎత్తున స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం
-
విద్యార్థులకు పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలి అని ఆశ ఉండటంలో తప్పు లేదు కానీ మొదటి అడుగు గా ఎదో ఒక్క కంపెనీ లో ఉద్యోగం సాధించి ప్రయాణం మొదలు పెట్టాలి.అప్పుడే ఉన్నత స్థాయి కి చేరుకుంటారు