విడుదలకు ముందే నర్తనశాల సేఫ్‌

Nartanasala Satellite Rights

ఛలో’ చిత్రంతో సూపర్‌ హిట్‌ను దక్కించుకున్న నాగశౌర్య మరోసారి భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. నాగశౌర్య హోం బ్యానర్‌లో రూపొందిన ‘నర్తనశాల’ చిత్రంను ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఉషా నిర్మించారు. కొడుకుతో సినిమా అవ్వడం వల్ల ఆమె ఖర్చు విషయంలో వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు.

దాంతో ఈ చిత్రానికి ఏకంగా 12 కోట్లకు పైగా ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. దాంతో పాటు కోటి రూపాయలతో పబ్లిసిటీ కూడా చేశారు. మొత్తంగా నర్తనశాల ఖర్చు 13 కోట్లను చేరింది. ఇంత బడ్జెట్‌ను నాగశౌర్య రికవరీ చేయగలడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఛలో సినిమా సక్సెస్‌ అయ్యింది కనుక కలెక్షన్స్‌ వచ్చాయి. ఒకవేళ ఫలితం తారు మారు అయితే భారీగా నిర్మాత నష్టపోవాల్సి వస్తుందని అంతా అనుకున్నారు.

nartanasala

‘నర్తనశాల’ చిత్రంపై ఉన్న నమ్మకంతో పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని మంచి రేటుకు కొనుగోలు చేయడం జరిగింది. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి రేటు పలికింది. థియేట్రికల్‌ రైట్స్‌ అమ్మడం ద్వారా నిర్మాత దాదాపుగా 8 కోట్లను దక్కించుకోవడం జరిగింది. ఇక శాటిలైట్‌ రైట్స్‌ ఆన్‌లైన్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ను అమ్మేసిన నిర్మాత మరో అయిదు కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తంగా సినిమా కోసం ఖర్చు చేసింది రికవరీ అయ్యింది.

nartanasala

ఇక విడుదల తర్వాత సినిమా సక్సెస్‌ అయితే వచ్చేవనీ కూడా లాభాలే. ఈ చిత్రాన్ని స్టార్‌ మా టీవీ భారీ మొత్తం పెట్టి శాటిలైట్‌ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. ఇక అమెజాన్‌ కూడా భారీ మొత్తం చెల్లించి ప్రైమ్‌ వీడియో రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. నిర్మాత అదృష్టంతో విడుదలకు ముందే సేఫ్‌ అయ్యింది. చిన్న చిత్రాలకు ఇలా జరగడం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు.

nartanasala