‘దంగల్‌’ కలెక్షన్స్‌ అబద్దం

national media rumours on amirkhan dangal movie collection

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ముఖ్యంగా చైనాలో ‘దంగల్‌’ చిత్రం ఊహకు కూడా అందని స్థాయిలో వసూళ్లు సాధించింది. వెయ్యి కోట్లకు పైగా చైనాలో వసూళ్లు సాధించిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక తాజాగా బాలీవుడ్‌లో ‘దంగల్‌’ చిర్రతం రెండు వేల కోట్లు సాధించింది అంటూ ప్రచారం మొదలైంది. జాతీయ మీడియాలో కూడా ‘దంగల్‌’ చిత్రం రెండు వేల కోట్లను వసూళ్లు చేసిందంటూ వార్తలు వస్తున్నాయి. 

దంగల్‌ రెండు వేల కోట్లు సాధించినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని స్వయంగా చిత్ర నిర్మాతల్లో ఒక్కరు చెప్పుకొచ్చారు. మా చిత్రం ఇంకా రెండు వేల కోట్ల వసూళ్లను చేరలేదని, ఇక ఆ మార్క్‌ చేరుతుందనే నమ్మకం కూడా తమకు లేదంటూ చెప్పుకొచ్చాడు. చైనా కలెక్షన్స్‌తో కలిపి మొత్తం 1864 కోట్లు మాత్రం వసూళ్లు సాధించినట్లుగా చెప్పుకొచ్చాడు. చైనాలో రెండు వారాల పాటు దుమ్ము దుమ్ముగా ఆడటంతో దాదాపు 1200 కోట్ల వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం ఇండియాస్‌ నెం.1 చిత్రంగా ‘దంగల్‌’ ఉంది. ఒక వేళ ‘బాహుబలి’ చిత్రం చైనాలో 300 కోట్లు వసూళ్లు చేస్తే నెం.2కు పడిపోతుంది.

మరిన్ని వార్తలు

బాలయ్యకు అస్వస్థత