Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుసగా ఏడు విజయాలను సొంతం చేసుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలతో కూడా ఖచ్చితంగా సక్సెస్‌లు అందుకోవడం ఖాయం అనే టాక్ సినీ వర్గాల్లో ఉంది. ఆ రెండు సినిమాల్లో ఒకటి దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఎంసీఏ’ కాగా మరోటి ‘కృష్ణార్జున యుద్దం’. ఈ రెండు సినిమాల షూటింగ్‌తో నాని చాలా బిజీగా ఉన్నాడు. దిల్‌రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న ‘ఎంసీఏ’ చిత్రం ఈ సంవత్సరం చివర్లో అంటే డిసెంబర్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే డేట్ కూడా ప్రకటించారు. ఇక మరో సినిమాను వచ్చే సంవత్సరం వేసవి కానుకగా విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను కూడా నాని కమిట్ అయ్యాడు. ఇంత బిజీగా ఉన్న నాని నిర్మాతగా ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.
గతంలో నాని తన స్నేహితులతో కలిసి ‘డీ ఫర్ దోపిడి’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా ఫలితం తారు మారు అయ్యింది. అయితే నాని పెద్దగా పెట్టుబడి పెట్టక పోవడంతో సేఫ్ అయ్యాడు. కాని ఈసారి ఒక కొత్త దర్శకుడిని నమ్మి, మంచి కథ అనే ఉద్దేశ్యంతో సొంతంగా నిర్మించాలని భావిస్తున్నాడు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. హీరోగా చాలా బిజీగా, సక్సెస్ ఫుల్ కెరీర్‌ను నడుపుతున్న నాని ఇప్పుడు నిర్మాతగా మారడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు. దయచేసి నాని సినిమాల నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. కాని నాని మాత్రం సినిమా నిర్మాణంకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతా కొత్త వారితో సినిమాను నిర్మించబోతున్నాడు. సినిమా నిర్మాణంలో పడి హీరోగా కెరీర్‌ను పక్కదారి పట్టిస్తాడేమో అనే అనుమానాలు సినీ వర్గాల వారిలో కూడా వ్యక్తం అవుతున్నాయి.
మరిన్ని వార్తలు: