నవాబ్ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్

Nawab Film Hit In Tamil And Flap In Telugu

నటీ నటులు : అరవింద్ స్వామి , శింబు, విజయ్ సేతుపతి,అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జ్యోతిక,                             అదితి రావు హైదరి, జయసుధ, ఐశ్వర్య రాజేష్,దయాన
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
నిమాటోగ్రఫీ : సంతోష్ శివన్
నిర్మాణం : మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్
రచన : మణిరత్నం -శివ అనంత్
దర్శకత్వం : మణి రత్నం

nawab movie

మణిరత్నం సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులని నిరాశపరిచాయి. అయితే ఎప్పటికప్పుడు ఆయన కొత్త సినిమా వస్తోందంటే మాత్రం ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు కారణం అందరికీ తెలిసిందే. అదే …మణిరత్నం. ఆయన ఎంచుకున్న సబ్జక్ట్స్ ఫెయిల్ అయివుండొచ్చు కానీ ఆయన ప్రతిభ మీద ఎవరికీ అపనమ్మకాలు లేవు. ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో మార్పులకి కారణం అయిన మణిరత్నం తాజాగా తీసిన నవాబ్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయం లో మణిరత్నం కి దక్కే క్రెడిట్ తో పాటు అది ఓ మల్టీస్టారర్ సినిమా కావడం కూడా ఆ బజ్ ఏర్పడేందుకు దారి తీసింది. మొత్తానికి నవాబ్ ఎలా వుందో చూద్దాం.

కథ….

nawab

 

భూపతి రెడ్డి(ప్రకాష్ రాజ్ ) సిటీ ని గడగడలాడించే ఓ పెద్దాయన . ఆయన ఎదుగుదల వెనుక అన్ని అవలక్షణాలు ఉంటాయి. ఈ విషయం లోనే భూపతి రెడ్డి ని భార్య (జయసుధ )దెప్పి పొడుస్తుంటుంది. వారికి ముగ్గురు కొడుకులు. ఒక కూతురు. కొడుకులు వరద ,త్యాగ , రుద్ర కూడా తండ్రి బాటలో నడుస్తుంటారు. అయితే పెద్ద కొడుకు వరద (అరవింద్ స్వామి ) మాత్రమే తండ్రితో ఉంటాడు. రెండో కొడుకు ( అరుణ్ విజయ్ ) దుబాయ్ లో , మూడో కొడుకు ( శింబు ) జార్జియా లో వుంటూ అక్రమ దందాలు నడుపుతుంటారు. ఇంతలో ఓ రోజు భూపతి రెడ్డి దంపతుల మీద హత్యాప్రయత్నం జరుగుతుంది. హాస్పిటల్ లో వున్న తల్లిదండ్రుల్ని చూసేందుకు అంతా ఇండియా వస్తారు. అప్పుడే భూపతి తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తుంది. దీంతో ఆ కుటుంబంలో మొదలైన గొడవలు చివరకు ఎటు దారి తీశాయి అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

nawab movie jyothika

 

మణిరత్నం లాంటి దర్శకుడు ప్రకాష్ రాజ్ , జయసుధ , అరవింద్ స్వామి , జ్యోతిక, అరుణ్ విజయ్ , శింబు , విజయ్ సేతుపతి లాంటి నటీనటులంతా కలిసి పనిచేయడంతో నవాబ్ కి ఓ కొత్త జోష్ వచ్చింది. ఆ జోష్ నిలబెట్టడానికి దర్శకుడు మణిరత్నం గట్టి ప్రయత్నమే చేసాడు. ఈ మధ్య తాను చేస్తున్న సినిమాలకు భిన్నంగా నవాబ్ కథ ఎంచుకున్నాడు. అందుకు తగ్గ నటీనటుల్ని ఎంచుకున్నాడు. కథతో పాటు కధనం కూడా గ్రిప్పింగ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమా తొలి భాగం చూస్తున్నంతసేపు ఎవరో కొత్త దర్శకుడు ప్రతిభావంతంగా తీసిన సినిమా అనిపిస్తుంది. అయితే సంభాషణల్లో మణిరత్నం ముద్ర స్పష్టంగా కనిపించింది. ఇక భూపతి మీద ఎటాక్ తర్వాత కథ ఆక్షన్ జోనర్ లోకి వెళుతుంది అనుకుంటే హఠాత్తుగా ఊహించని మలుపు తిప్పడంలో మణి సక్సెస్ అయ్యాడు.

nawab aravindha swamy

ఇక తర్వాత పరిణామాలు చాలా సహజంగా అనిపిస్తాయి. అయితే ఎక్కడా సినిమాటిక్ పరిణామాలు కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు మణి. హింస తో పాటు రౌడీయిజం ని నమ్ముకున్న కుటుంబాల్లో ఎదురయ్యే పరిణామాలు, ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలా తయారు అవుతారో మణి సున్నితంగా చెప్పాడు. అయితే తీసుకున్న బ్యాక్ డ్రాప్ తో ఆ విషయాలన్నీ మొరటుగానే కనిపిస్తాయి. ఇక చివరికి మిగిలేది సున్నా అంటూ అరవింద్ స్వామి చెప్పే డైలాగ్స్, జ్యోతిక చివరి సీన్ కూడా దర్శకుడి మనసుకు అద్దం పడతాయి. సినిమా క్లయిమాక్స్ సూపర్. అయితే తమిళ ప్రేక్షకులకి నచ్చినట్టు తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందా అన్నది సందేహమే .

nawab jyothika
నటీనటులు ఒక్కోరు విశ్వరూపమే చూపారు. ప్రకాష్ రాజ్ మొదలుకుని శింబు దాకా ప్రతి ఒక్కరిలో పూర్తి స్థాయి, సహజమైన నటన రాబట్టడం లో మణిరత్నం సక్సెస్. అయితే విజయ్ సేతుపతి అందరిలో స్పెషల్ ఎందుకో నవాబ్ తో అర్ధం అయ్యింది. ఇక మ్యూజిక్ , కెమెరా లాంటివి కూడా మణిరత్నం సినిమాల్లో లాగానే హైలైట్.

nawab movie jyothika swamy
తెలుగు బులెట్ పంచ్ లైన్ … ”నవాబ్ “ తమిళ ప్రేక్షకులకే.
తెలుగు బులెట్ రేటింగ్ … 2 .75 /5 .