Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“తిట్టడానికి అలవాటుపడ్డ నోరు..పెట్టడానికి అలవాటు పడ్డ చేయి “అంత తొందరగా మారవు. ఈ విషయం మరోసారి నిజమని నిర్ధారణ అయ్యింది తెలంగాణ హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి విషయంలో. అయితే ఒక్కో సందర్భంలో తిట్లు కూడా పొగడ్తలుగా ,పొగడ్తలు తిట్లుగా మారే అవకాశం ఉందని రెడ్డి గారు అర్ధం చేసుకోలేకపోయారు.అందుకే మే డే సందర్భంగా నాయిని చేసిన ఓ ప్రకటన తెలంగాణ మంత్రి కేటీఆర్ కి పంటి కింద రాయిలా పడితే,ఆంధ్ర సీఎం చంద్రబాబు కి హాట్ అనుకున్నది కాస్త స్వీట్ గా మారిపోయింది.ఈ వ్యవహారంలోనే బాబు ఆపిల్ దొంగ అయిపోయారు.
మనసుకి అనిపించింది అనిపించినట్టు,మధ్యలో ఫిల్టర్ వాడకుండా మాట్లాడడంలో నాయిని కి పెట్టింది పేరు.అందుకే కేటీఆర్ ని పొగుడుతూ నాయిని మాట్లాడ్డం మొదలెట్టారు.” ఐటీ లో రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ నెంబర్ వన్ గా నిలబెట్టారు.పక్క రాష్ట్రం మనతో పోటీ పడుతోంది.నిజానికి ఆపిల్ ఇక్కడికే రావాల్సి వుంది.కానీ ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడకి తీసుకెళ్లారు.అందుకే మనం గట్టిగా ఉండాలి”…ఈ లెవెల్ లో నాయిని స్పీచ్ ఇచ్చేసారు.అది పూర్తి అయ్యాక గానీ ఏ అర్ధంలో అది బయటకు వెళుతుందో అక్కడి వారికి అర్ధం కాలేదు.ఈయన్ని పొగిడి ఆయన్ని తిడదామని మొదలెట్టి రివర్స్ పంచ్ ఇచ్చేసారు నాయిని.దీంతో బాబు “ఆపిల్ దొంగ” అయితే అయ్యారేమోగానీ టీడీపీ శ్రేణులు,ఏపీ ప్రజలు ఖుషీ అయిపోతున్నారు.ఇంత జరిగాక నాయిని గారికి ఏమి చెప్పగలం? రాజకీయం ట్రెండ్ మారిందని ,కాస్త ముందు వెనుక చూసుకుని మాట్లాడాలని తప్ప.