Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శివసేన వ్యవస్థాపకులు, మరాఠీ బెబ్బులి బాల్ థాక్రే జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న థాక్రే సినిమాపై వివాదం రాజుకుంది. బాల్ థాకరే హిందూనేతఆయన వస్త్రధారణ కూడా హిందూ సంప్రదాయం ప్రకారమే ఉంటుంది. శివసేన పార్టీ హిందువుల పార్టీగానే గుర్తింపుపొందింది. అలాగే మహారాష్ట్రలో మరాఠీలకు పెద్దపీఠ వేయాలని థాకరే తన జీవితమంతా పోరాడారు. అనేకసార్లు విధ్వంకర ఆందోళనలు కూడా నిర్వహించారు. అలాంటిది ఆయన జీవితం ఆధారంగా తీస్తున్న సినిమాలో మాత్రం దర్శకనిర్మాతలు ఇందుకు భిన్నమైన పంథా ఎంచుకున్నారు.
బాల్ థాకరే పాత్రను పోషించే అవకాశం ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ముస్లింనటుడు నవాజుద్దీన్ సిద్దిఖీకి ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. హిందూ సంప్రదాయాలను తుచతప్పకుండా పాటిస్తూ ముస్లింలను, వారి విధానాలను తీవ్రాతితీవ్రంగా వ్యతిరేకించిన బాల్ థాకరే పాత్రలో ఓ ముస్లింను ఎలా తీసుకున్నారని ట్విట్టర్ లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బాల్ థాకరేకు తెలిస్తే ఆయన సమాధి నుంచి లేచివస్తారని కొందరు వ్యాఖ్యానించారు. ఆర్థిక రాజధాని ముంబైకి యూపీ, బీహార్ రాష్ట్రాల నుంచి వలసలను, ముఖ్యంగా మైనార్టీలరాకను వ్యతిరేకించి, మరాఠీలకే ఉపాధి అవకాశాలు కల్పించాలని బాల్ థాకరే చేసిన పోరాటాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తి జీవితం పై తీస్తున్న సినిమాలో ఓ ముస్లింను, అందులోనూ యూపీకి చెందిన నటుడ్ని తీసుకోవడమేమిటని వారు విమర్శిస్తున్నారు. మరాఠీ నటులును ఎందుకు ఎంపికచేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అటు మరికొందరు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు.
హిందూ ఛాందసవాద నాయకుడి పాత్రను ఓ ముస్లిం నటుడితో పోషింపచేయడం హర్షింషదగ్గవిషయం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా…మరొకరు థాక్రే పాత్రలో ముస్లింను చూపించడం చల్లని మాటని ట్వీట్ చేశారు. ఇంకొందరు ఆహా ఏమీ వైరుధ్య వైవిధ్యము అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. మరొక నెటిజన్ ఇంకాస్త వ్యంగ్యం జోడించి ఓ కామెంట్ పోస్ట్ చేశారు. థాకరే పాత్ర కోసం యూపీ నుంచి సిద్ధిఖీని తీసుకున్నట్టే బీహార్ నుంచి రవికిషన్ ను తీసుకుంటే తానింకా ప్రశాంతంగా మరణిస్తానని ట్వీట్ చేశారు. ఈ విమర్శల్ని పక్కనపెడితే థాక్రే పాత్రలో సిద్దిఖీ జీవించారని ట్రైలర్ చూసినవారు ప్రశంసిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజాన్ సినిమాలో జర్నలిస్ట్ పాత్రతో గుర్తింపుతెచ్చుకున్న సిద్దిఖీ థాక్రే తో పాటు మరో బయోపిక్ లో కూడా నటిస్తున్నారు. దేశవిభజన గాయాలపై గుండెలు మండించే కథలను రాసిన సాదత్ హసన్ మంటో జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో మంటో పాత్ర పోషిస్తున్నారు.