Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతిలోకసుందరి శ్రీదేవి మరణం అభిమానులకి జీర్ణం కావడం లేదు. ఆమె మృతదేహం ఇంకా దుబాయ్ నుంచి రానేలేదు. ఓ పక్క ఆమె మరణం మీద లెక్కలేనన్ని సందేహాలు. ఇలాంటి సమయంలో కూడా శ్రీదేవి స్వర్గానికి వెళితే ఏమవుతుందో ఊహించి రాసాడు ఓ నెటిజెన్. అతను ఎవరో కచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఆయన రాసిన మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అవుతోంది. ఆ విషయం మీ కోసం .
-
రంభ ఊర్వశి మేనక తిలోత్తమల మద్య పెరిగిన పోటీ.
-
శ్రీదేవి నీ చూసి పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్, శోభన్ బాబు.
-
ప్రేమాభిషేకం సినిమాని మళ్లీ రీమేక్ చేసే పనిలో దాసరి. ఒకే చెప్పిన అక్కినేని.
-
అతిలోక సుందరినీ సీత గా చూపిస్థానంటున్న బాపు రమణ. వెంటనే షూటింగ్ మొదలుపెట్ట మన్న ఎన్టీఆర్.
-
వసంత కోకిల కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్న దర్శకుడు బాల చందర్.
-
వెల్లువొచ్చి గోదారమ్మ పాట కోసం యముడ్ని బిందెలు అడుగుతున్న శోభన్ బాబు.
-
పాట చెడగొడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య.
-
బంగారు బిందెలయిన పర్వాలేదు. డబ్బులు నేను పెట్టుకుంటా నంటున్న రామానాయుడు.
-
ఇంత కాలానికి ఆడ తోడు దొరికిందని సంతోష పడతున్న తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత.
-
28 ఏళ్ల తరువాత ఇంద్రజ స్వర్గ లోకానికి రావడంతో పార్టీ చేసుకుంటున్న తండ్రి ఇంద్రుడు.
-
మళ్ళీ ఉంగరం పాడేస్తా దేమొనని… శ్రీదేవి దగ్గర నుంచి ఉంగరం తీసేసుకున్న ఇంద్రుడు.