పవన్ కళ్యాణ్ ని పొగిడేసిన నిధి అగర్వాల్

పవన్ కళ్యాణ్ ని పొగిడేసిన నిధి అగర్వాల్

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అందమైన హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో నిధి టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టింది. ఆ తరవాత ‘మిస్టర్ మజ్ను’లో అఖిల్ సరసన నటించినా కలిసిరాలేదు. అయితే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా నిధి అగర్వాల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో డాక్టర్‌గా మంచి నటనతో పాటు తన గ్లామర్‌తో కుర్రకారుని కట్టిపడేశారు. ఇప్పుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతోన్న సినిమాలో నిధి నటిస్తున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటం వల్ల నిధి ఇంట్లోనే ఉంటున్నారు. తన కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తోనూ టచ్‌లో ఉంటున్నారు. బుధవారం నిధి అగర్వాల్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై, తన పెళ్లిపై ఆమె స్పందించారు. ‘పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి’ అని ఒక అభిమాని అడగగా.. ‘సినిమాకు పవన్ కళ్యాణ్ సార్ ఒక గిఫ్ట్’ అని నిధి సమాధానం ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.

.