Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీహార్ అధికార కూటమిలో అంతర్గత రాజకీయ పోరు రసకందాయంలో పడింది. లాలూ కుటుంబం మీద సిబిఐ దాడులపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనంగా వున్నారు. ఆ దాడులు రాజకీయ ప్రేరేపితమని లాలూ నెత్తినోరు బాదుకుంటున్నా ఆర్జేడీ తో అధికారాన్ని పంచుకుంటున్న నితీష్ మాత్రం అది తనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పైగా ఆర్జేడీని పక్కనబెట్టి బీజేపీ తో కలవడానికి నితీష్ ఆసక్తిగా ఉన్నట్టు కధనాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం తరపున ఒక్క మంత్రి కూడా దాన్ని ఖండించిన పాపాన పోలేదు.
అటు లాలూ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బీహార్ లో కూడా అధికారానికి దూరమైతే ఎదురయ్యే పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నారు. తాము ప్రభుత్వం నుంచి వైదొలగబోమని, తన కొడుకు తేజస్వి యాదవ్ రాజీనామా డిమాండ్ అర్ధం లేదని చెబుతున్నారు. అయితే తమ గురించి ఒక్క సానుకూల వ్యాఖ్య చేయడానికి కూడా ముందుకు రాని నితీష్ మీద నోరు తెరవకుండా జాగ్రత్తపడుతున్నారు. లాలూ తన అవసరం కొద్దీ ఎంత సర్దుకుపోతున్నా నితీష్ మాత్రం ఆర్జేడీ కి పొగబెట్టే పనులు ఆపడంలేదు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు చేప్పట్టిన సభలు, సమావేశాలకు దూరంగా ఉండట తో పాటు నితీష్ బీజేపీ అభ్యర్థి కోవిద్ కి మద్దతు పలకడం పెద్ద షాక్. ఇక ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ నితీష్ ఇదే వైఖరి అవలంభిస్తున్నారు. అటు బీజేపీ అభ్యర్ధికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గొంతెత్తుతున్న లాలూకి ఈ పరిణామాలు చాలా ఇబ్బంది కరంగా మారాయి. ఓ విధంగా చెప్పాలంటే అవమానకరంగా నిలుస్తున్నాయి.
మరిన్ని వార్తాలు
మందకృష్ణ వెనుక గుర్తు తెలియని కార్లు?