ఒక్కటి కూడా మెప్పించలేదు

No Successful Movie In Tollywood In 2 Months Of 2018 Year

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

2018 సంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు పూర్తి అవ్వబోతుంది. కాని ఇప్పటి వరకు భారీ విజయాన్ని దక్కించుకున్న చిత్రాలే రాలేదు. ‘ఛలో’ మరియు ‘తొలిప్రేమ’ చిత్రాలు కాస్త పర్వాలేదు అనుకున్నా కూడా భారీ విజయాలను మాత్రం నమోదు చేయలేక పోయాయి. ప్రస్తుతం పరీక్షల సీజన్‌ అవ్వడంతో సినిమాల విడుదల అంతంత మాత్రంగానే ఉంది. పెద్ద చిత్రాలు లేక పోవడంతో చిన్న చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు పది చిత్రాలు ఈ రెండు వారాల్లో విడుద అయ్యాయి. ఏ ఒక్క చిత్రం కూడా కనీసం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం కాని, మినిమం కలెక్షన్స్‌ను సాధించడం కాని జరగలేదు. 

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జువ్వ, రారా, చల్తే చల్తే, హైదరాబాద్‌ లవ్‌ స్టోరీ చిత్రాలు తీవ్ర నిరాశ పర్చాయి. ఇందులో ఒక్కటి కూడా కనీసం పర్వాలేదు అన్నట్లుగా ఉంది. అంతకు ముందు వారం వచ్చిన చిత్రాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ వచ్చిన ‘మనసుకు నచ్చింది’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు సాలిడ్‌ సక్సెస్‌ను దక్కించుకున్న చిత్రమే రాలేదు. మార్చి చివర్లో ‘రంగస్థలం’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రంతో టాలీవుడ్‌కు భారీ సక్సెస్‌ ఈ సంవత్సరంలో నమోదు అవుతుందేమో చూడాలి.