Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రతిష్టాత్మక సినిమాల గురించి వాటి నిర్మాణ దశలో జరిగే చర్చ అంతాఇంతా కాదు. ఆ కోవలో సదరు సినిమాల హీరోల అభిమానులు, దర్శకుల ఫాన్స్ చిత్ర కథ ఎలా వుండబోతుందో ఓ అంచనాకి వస్తారు. మరికొందరు అయితే తామే ఆ సినిమాకి రచయిత అయినట్టు భావించి కథ రాసేస్తారు. ఆలా సినిమా విడుదలకి ముందే బయటికి వచ్చిన సినిమా కధలు చాలానే ఉంటాయి. వీటిలో ఏ కొద్ది మాత్రమే అసలు కధకి దగ్గరగా ఉంటాయి. ఈ మధ్య అలా బాహుబలి 2 కథ కూడా బయటికి వచ్చింది. దాదాపుగా సినిమాకి దగ్గరగా వుంది. ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనాలకు తెర లేపుతున్న జై లవకుశ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ వైరల్ అవుతోంది. ఆ స్టోరీ లో కీ పాయింట్ మీ కోసం.
జైలవకుశ లో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రలకి తండ్రి ఒక్కరే. తల్లులు వేర్వేరు. తొలి భార్యకి సంతానంగా జై పుడతాడు. ఆమె చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకుంటే కవలలు లవకుశ పుడతారు. అయితే తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని జై ఇంటి నుంచి పారిపోయి ఓ కసితో గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. పెద్దవాడు అయ్యాక రాజకీయంలో కూడా అడుగు పెట్టే జై తన కన్నతండ్రిని, సోదరుల్ని కూడా చంపాలనుకుంటాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య ఏమి జరిగిందన్నది కథ. చూడ్డానికి కథ ఇంటరెస్టింగ్ గానే వుంది. అయితే తేలాల్సింది ఇది కాదు. ఈ కథ నిజమా కాదా అన్నది మాత్రమే.
మరిన్ని వార్తలు: