బీజేపీ కి వైసీపీ ఎన్ని సీట్లు ఆఫర్ చేసిందో తెలుసా ?

YS Jagan offer 35 assembly seats and 10 lok sabha seats to Bjp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ బంధానికి బీటలు గొట్టి తాము కమలనాధులతో కలిసిపోవాలని వైసీపీ అధినేత జగన్ చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రపతి ఎన్నికలకి ఆ పార్టీ మద్దతు కోరడమే ఆలస్యంగా జై కొట్టిన జగన్ ఆ బంధాన్ని రాజకీయంగా పటిష్టం చేసుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. నిజానికి బీజేపీ తో పొత్తు వల్ల ఎన్నికల్లో జరిగే లబ్ది పెద్దగా ఉండదని జగన్ కి కూడా తెలుసు. పైగా జగన్ కి అనుకూలంగా ఉన్న కొన్ని వర్గాలు ఆ పొత్తుకు వ్యతిరేకం కూడా. అయినా జగన్, బీజేపీ వైపు ఆశగా చూడడానికి కేసులే ప్రధాన కారణం. సీఎం పోస్ట్ తర్వాత సంగతి ముందు అవినీతి కేసులనుంచి బయటపడడమే జగన్ కి పెద్ద సవాల్. వాటి నుంచి బయటపడాలంటే జాతీయ పార్టీల అండ తప్పనిసరి. కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది కాబట్టి బీజేపీ ని ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు ఒప్పించడానికి జగన్ ట్రై చేస్తున్నారు.

బీజేపీ తో పొత్తు ప్రయత్నాల పనిని తన సన్నిహితుడు విజయసాయికి కి అప్పగించారట జగన్. ఆయన చంద్రబాబు అంటే పెద్దగా ఇష్టం లేని రామ్ మాధవ్ వైపు నుంచి నరుక్కొస్తున్నాడంట. రామ్ మాధవ్ ముందు విజయసాయి పొత్తు ప్రస్తావన తేవడమే కాకుండా అందులో భాగంగా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పారట. 10 లోక్ సభ, 35 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు కూడా వైసీపీ తరపున విజయసాయి ఇచ్చిన మాటకు బీజేపీ కూడా బాగా టెంప్ట్ అవుతోందట. అయితే బీజేపీ బలపడకుండా అన్ని సీట్లు తీసుకుంటే పరోక్షంగా టీడీపీ కి లాభం చేకూరుతుందన్న చిన్న లాజిక్ జగన్ ఎలా మిస్ అయ్యారో పాపం.

మరిన్ని వార్తలు:

కేవీపీ ముందే ఆ స్వామీజీ కాళ్ళ మీద పడ్డ జగన్.

జానారెడ్డితో కాంగ్రెస్ సతమతం

జగన్ తో కలిసి పవన్ పనిచేయగలడా..?