భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతి కానుకగా నిన్న విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఇలాంటి అట్టర్ ఫ్లాప్‌ను పొందినది లేదు. ఆ మద్య ఖలేజా చిత్రం ఫ్లాప్ అయినా ఈ రేంజ్లో ఆయనపై విమర్శలు రాలేదు. ఒక పవర్ వంటి స్టార్‌తో ఆడపిల్లలా ఏడిపించడం, చమ్మ చక్క అంటూ గెంతులు వేయించడంను ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. సీరియస్‌గా సాగాల్సిన కథను సిల్లీ కామెడీతో నడిపించడం వల్లే సినిమా దొబ్బింది అనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన తర్వాత సినిమాపై ఆలోచనలో పడ్డట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
‘అజ్ఞాతవాసి’ చిత్రం ఫ్లాప్ అయినంత మాత్రాన త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ చేసుకునేంతగా ఆలోచించడం లేదు కాని, సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందే స్క్రిప్ట్‌ను మరోసారి సరి చూసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అయిన ఒక రచయిత మరియు దర్శకుడు అయిన వ్యక్తి త్రివిక్రమ్ రెడీ చేసిన స్క్రిప్ట్‌ను చూడబోతున్నాడట. అందులో అతి కామెడీ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ గురించి మరోసారి ఆలోచించేలా త్రివిక్రమ్‌ను ఒప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ చిత్రంలో కూడా దర్శకుడు త్రివిక్రమ్ కాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ను చూపించాలని భావిస్తున్నాడట. అందుకే స్క్రిప్ట్‌లో కామెడీ సీన్స్‌ను ఎక్కువగా రాశాడు. ఇప్పుడు ఆ విషయంలో ఎన్టీఆర్ కాస్త ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. కామెడీ సీన్స్‌ను తగ్గించాల్సిందిగా త్రివిక్రమ్‌ను ఎన్టీఆర్ కోరే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. త్వరలోనే ఎన్టీఆర్‌తో మూవీని షురూ చేసే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని త్రివిక్రమ్‌కు చెప్పే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌కు సన్నిహితుడు అయిన దర్శకుడు చెప్పే మార్పులను త్రివిక్రమ్ చేస్తాడా అనేది చూడాలి.