Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉత్సాహం పొంగిపొర్లుతోంది. సంతోషం తొణికిసలాడుతోంది. ఆ సంతోషానికి మూడేళ్ళ వయసు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పాడు ఎన్టీఆర్. సంతోషానికి బర్త్ డే ఏంటి అనుకుంటున్నారా ? ఆ సంతోషం మరేదో కాదంట. తన ముద్దుల కొడుకు అభయ్ రామ్ అంట . ముద్దుల అభయ్ కి మూడో పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా కాస్త భావోద్వేగపు టచ్ ఇస్తూ చెప్పాడు ఎన్టీఆర్. ” నా సంతోషానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ ఆశీస్సులు ఓ వరం. అవి అందజేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు” అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ తో కొడుకు రాకతో ఎన్టీఆర్ జీవితం ఎంతగా మారిపోయిందో అర్ధం అవుతూనే వుంది.
అభయ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా అతనితోనే ఎక్కువ సమయం గడిపాడు ఎన్టీఆర్. పూణే లో వున్న ఎన్టీఆర్ ఓ వైపు జైలవకుశ, ఇంకో వైపు బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయినా పుట్టిన రోజు జరుపుకున్న కొడుకుని తీసుకుని బిగ్ బాస్ సెట్స్ కి వచ్చాడు ఎన్టీఆర్. సరదాగా కొడుకుతో ఆదుకున్నాడు. షూటింగ్ బ్రేక్ టైం లో కొడుకుతో గడిపి ఎన్టీఆర్ ఈ బర్త్ డే ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేలా ప్లాన్ చేసాడు .
మరిన్ని వార్తలు