Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ గోపాల్ వర్మ, నాగార్జునల కాంబినేషన్‌లో సినిమా అనగానే ఠక్కున అందరికి గుర్తుకు వచ్చే చిత్రం ‘శివ’. అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న శివ ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. సుదీర్ఘ విరామం తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున సినిమా తెరకెక్కింది. వర్మ స్టైల్‌లో ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే తేలిపోయింది. వర్మ గత కొంత కాలంగా సక్సెస్‌లను దక్కించుకోలేక పోతున్నాడు. ఆ సినిమాలను వర్మ దృష్టి, శ్రద్ద పెట్టి తీయలేదని, అందుకే ఆ సినిమాలు ఆకట్టుకోలేక పోయాయి అని, అయితే వర్మ ఇప్పుడు ఈ చిత్రాన్ని మాత్రం తన దృష్టిని పెట్టి, పూర్తి శ్రద్దతో తెరకెక్కించాడని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంను చిత్ర యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా అనగానే కాస్త అనుమానాలు వస్తున్నాయి. కాని వర్మ ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నాడు. సినిమాను కథ చెప్పిన విధంగా తీయకుంటే తన్నినా పడుతాను అంటూ నాగార్జునతో వర్మ అన్నాడట. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ సందర్బంగా నాగార్జున ప్రస్థావించాడు. వర్మ నాకు ఆ పని లేకుండా చేశాడు, తన్నాల్సిన అవసరం లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వివాదం లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. భారీ ఎత్తున ఈ చిత్రం విడుదల చేయాలని ప్రయత్నించినా కూడా కొన్ని కారణాల వల్ల ఆశించిన స్థాయిలో థియేటర్లు లభ్యం కాలేదు. ఈ చిత్రంతో వర్మ కమ్‌బ్యాక్ అవుతాడని అంతా భావిస్తున్నారు.