Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘మహానటి’ చిత్రాలు మినహా ఈ మూడు నెలల్లో ఏ ఒక్క సినిమా ఆకట్టుకోలేక పోయింది. పదుల సంఖ్యలో సినిమాలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో కొన్ని పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్ ముందు సందడి చేయలేక పోయాయి. ఇప్పటికి కూడా పై మూడు సినిమాలు మాత్రమే కాసుల వర్షం కురిపిస్తుంది. వారాలకు వారాలు అయినా కూడా ఆ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు అంటే వారికి నచ్చిన సినిమాలు మరేం రాలేదు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నా కూడా సక్సెస్ రేటు చాలా తక్కువ ఉన్న కారణంగా రాబోతున్న సినిమాల వైపు అందరి దృష్టి ఉంది. రేపు మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ఆ మూడు సినిమాల్లో ఎక్కువ శాతం ఆఫీసర్ వైపు చూస్తున్నారు. నాగార్జున, వర్మల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ‘శివ’ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. కాని విశ్లేషకులు మాత్రం ఆఫీసర్ సినిమా అటు ఇటు కాకుండా పోతుందని, జస్ట్ యావరేజ్‌గా నిుస్తుందని, యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా వర్మ సినిమా అవ్వడంతో ఖచ్చితంగా ఫ్లాప్‌గా నిలుస్తుందని అనుకుంటున్నారు. ఇక రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘రాజుగాడు’ చిత్రం కూడా రేపు విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రాజుగాడు పాత్ర ఒక దొంగ. ఫన్నీగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నా కూడా చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఈ చిత్రం ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ శాతం మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళంలో ఇటీవలే విడుదలైన అభిమన్యుడు చిత్రం తెలుగులో రేపు రాబోతుంది. నాపేరు సూర్య చిత్రం టైప్‌లో ఉండబోతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే అంటూ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో కూడా ఏ ఒక్కటి సక్సెస్ కాకపోవచ్చు అంటున్నారు.