ఒక్కడు మిగిలాడు… తెలుగు బులెట్ రివ్యూ

Okkadu Migiladu Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   మనోజ్, జెన్నీఫర్, అనీష ఆంబ్రోస్, సుహాసిని 

నిర్మాత  :   లక్ష్మీ కాంత్ , ఎస్. ఎన్. రెడ్డి 
దర్శకత్వం : అజయ్ఆండ్రూస్ 

మ్యూజిక్ డైరెక్టర్ :   శివ నందిగామ 

ఇండియన్ సినిమాల వివాదాలకు కొదవలేదు. సినిమా రిలీజ్ అయ్యాక వివాదం రేగడం ఒక ఎత్తు అయితే అసలు ముందే వివాదం అవుతుందని తెలిసిన సబ్జెక్టు మీద సినిమా తీయడం ఇంకో ఎత్తు. అలాంటి సబ్జెక్టు మీద తీసిన సినిమాలు చాలా వరకు ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. ఈ కోవలో రాజీవ్ గాంధీ మరణం చుట్టూ అల్లుకున్న కథతో సెల్వమణి తీసిన కుట్రపత్రికై సినిమా దాదాపు 15 ఏళ్లుగా బాక్సుల్లో మురిగిపోయింది. ఇప్పుడు పద్మావతి కధాంశంగా సంజయ్ లీల భన్సాలీ చేస్తున్న సినిమా పద్మావతి కూడా షూటింగ్ సహా వివిధ దశల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఒక్కడు మిగిలాడు కాస్త తక్కువ ఇబ్బందులతో రిలీజ్ కి నోచుకుంది. LTTE నేత వేలుపిళ్లై ప్రభాకరన్ పాత్ర చుట్టూ రాసుకున్న ఈ సినిమా మీద అంచనాలు లేకున్నా అమిత ఆసక్తి మాత్రం నెలకొంది. ఇక సరదా సరదాగా వుండే మనోజ్ మాటల్లో లోతు,గంభీరత పెరగడానికి ఈ సినిమాలో ఆయన చేసిన రెండు పాత్రల ప్రభావం వుంది. ఎన్నో పాత్రలు చేసే ఓ హీరో మీదే ఇంత ప్రభావం చూపిన ఒక్కడు మిగిలాడు ఎలా వుందో చూద్దామా..

కథ…

జైల్లో ఖైదీగా వున్న విద్యార్థి నాయకుడిని ( మనోజ్ ) పోలీసులు ఓ కేసులో విచారణ చేస్తుంటారు. విద్యార్థులతో పాటు వివిధ సామాజిక సమస్యలపై అతను పోరాడుతుంటాడు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే తత్వం అతనికి ఉంటుంది. దాని వల్లే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అతనిలోని ఈ పోరాట నైజం ఎక్కడ నుంచి వచ్చింది ? అసలు అతను ఎవరు ? ఎక్కడివాడు అనే ప్రశ్నలకి సమాధానంగా శ్రీలంకలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. LTTE ఉద్యమం నాటి పరిస్థితులు, ఉద్యమ నేత ప్రభాకరన్ ( మనోజ్ ) జీవిత నేపథ్యంలో కధ మొదలు అవుతుంది. ప్రభాకరన్ కి, విద్యార్థి నేతకి వున్న బంధం ఏమిటి చివరకు ఈ పోరాట పంధా ఎక్కడికి దారి తీసింది అన్నదే ఒక్కటే మిగిలాడు సినిమా.

విశ్లేషణ…

సినిమా అంటే వినోదం మాత్రమే కాకుండా జనాన్ని జాగృతపరిచే ఓ కళాసాధనంగా చూసే యువ దర్శకుడు అజయ్ నూతక్కి. 2009 నాటి శ్రీలంక అంతర్యుద్ధం నాటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టే ఉద్దేశంతో తీసిన ఈ దర్శకుడు దాదాపుగా ఇదే నేపథ్యంలో 4 సంవత్సరాల కిందట తమిళంలో “రావణ దేశం “ అనే సినిమా తీసాడు. పూర్తి స్థాయిలో శ్రీలంక తమిళుల పరిస్థితికి అద్దం పట్టిన ఆ సినిమాకి కొనసాగింపు అన్నట్టుగా వుంది ఒక్కడు మిగిలాడు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన అజయ్ నూతక్కి ఈ సినిమాలో మనిషికి తన అస్తిత్వం, ఉనికి ప్రమాదంలో పడినపుడు ఎలా స్పందిస్తాడు ? ఆధిపత్య ధోరణి ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుంది అన్న ఆలోచన కేంద్రంగా నడిపించాడు. ఆ ఆలోచనలో వున్న గంభీరత సినిమా తొలి షాట్ నుంచి చివరిదాకా కొనసాగింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ దర్శకుడి తపనకు ఓ మచ్చుతునక. శ్రీలంక ఆర్మీ తో మనోజ్ తలపడే ఆ సన్నివేశం సినిమాకే హైలైట్. ఇక సెకండ్ హాఫ్ లో శ్రీలంక లో పరిస్థితుల్ని భావోద్వేగభరితంగా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. డైలాగ్స్ లో డెప్త్ వుంది. ఆలోచింపచేసే విధంగా వున్నాయి. అయితే కామన్ మాన్ కి ఎంతవరకు ఎక్కుతాయో చూడాలి.

ఒక్కడు మిగిలాడు తర్వాత మనోజ్ ఆలోచనల్లో వచ్చిన మార్పు ఈ సినిమాలో అతను పోషించిన పాత్రల ప్రభావమే. అంతగా తాను చేసిన రెండు పాత్రల్లో ఇమిడిపోయాడు మనోజ్. డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఈ సినిమాలో ఓ కొత్త మనోజ్ కనిపిస్తాడు. ఇన్నాళ్లు హీరో గా మాత్రమే వున్న మనోజ్ ఈ సినిమాతో నటుడిగా ఒక్కసారిగా నాలుగు మెట్లు ఎక్కాడు. దర్శకుడు నూతక్కి నటుడిగా కూడా అదరగొట్టాడు. కెమెరా పనితనం బ్రహ్మాండం.

ప్లస్ పాయింట్స్ .

సబ్జెక్టు
మనోజ్
దర్శకత్వం
కెమెరా
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .

తెలుగుబుల్లెట్ పంచ్ లైన్…”ఒక్కడు మిగిలాడు “ చెప్పకుండా చేసిన రావణ దేశం సీక్వెల్ .
తెలుగు బులెట్ రేటింగ్… 3 .25 /5 .